Shilpa Shetty: శిల్పా శెట్టి రియాక్షన్‌ చూసి షాక్‌ అయ్యాను : రాజ్ కుంద్రా

బాలీవుడ్‌ బ్యూటీ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ‘యూటీ 69’తో నటుడి ఎంట్రీ ఇస్తున్నారు. రెండేళ్ల క్రితం రాజ్‌ కుంద్రా బ్లూ ఫిల్మ్స్‌ కేసులో దాదాపు అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే! ఆరు నెలలపాటు జైల్లో ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఎలాంటి మానసిక సంఘర్షణకు గురయ్యారో తెలియజేస్తూ ఈ చిత్రాన్ని తీసినట్లు తెలుస్తోంది. షానవాజ్‌ అలీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను ముంబైలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌ కుంద్రా ‘యూటీ 69’ సినిమా చేయడానికి వెనకున్న కథేంటో చెప్పాడు.

ఈ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు.. (Shilpa Shetty) శిల్పా శెట్టి రియాక్షన్‌ చూసి షాక్‌ అయ్యాను అన్నారు. ఆమె అంగీకారినికి చాలా సమయం పట్టిందని చెప్పారు. ‘‘జీవితంలో నేను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను ఆధారంగా చేసుకుని ‘యూటీ 69’ తెరకెక్కించాం. ఇందులో నేనే నటించాలని నిర్ణయించుకున్నా. ఆ విషయం శిల్పకు చెప్పిన రోజును ఎప్పటికీ మర్చిపోను. ఆ సమయంలో ఆమెకు కాస్త దూరంగా నిల్చొని ‘నేనొక సినిమా చేయాలనుకుంటున్నా.

నా దగ్గర స్ర్కిప్ట్‌ సిద్థంగా ఉంది’’ అని చెప్పాను. తను ఏం మాట్లాడకుండా నాపైకి చెప్పు విసిరింది. ఆమె చర్యకు షాకయ్యా. కొన్ని రోజుల తర్వాత దర్శకుడు షానవాజ్‌ అలీ.. తనని కలిసి కథ వివరించాడు. మానవీయ సంబంధంపై ఈ సినిమా ఉండనుందని ఆమె అర్థం చేసుకుంది. ఆ క్షణం నుంచి నాకు సపోర్ట్‌గా నిలిచింది. ‘యాక్ట్‌ చేయగలవా? అంతా ఓకేనా?’ అంటూ తరచూ అడుగుతూ ఉండేది’’ అని రాజ్‌కుంద్రా చెప్పారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus