స్టార్ డమ్, క్రేజ్ అనేవి కర్పూరం లాంటిది. చూడ్డానికి చక్కగా, మంచి వాసనతో కనిపించినా.. ఒక్కసారి వెలిగిస్తే మాయం అవ్వడానికి నిమిషం కూడా పట్టదు. అందుకే కర్పూరానికి నిప్పు అంటకుండా కాపాడుకోవాలి. స్టార్ డమ్ కి తుప్పు పట్టకుండా జాగ్రత్తపడాలి. రాజ్ తరుణ్ కి ఈ సూత్రం ఇంకా తెలిసినట్లు లేదు. కెరీర్ ను ఏమాత్రం ప్లాన్ చేసుకోకుండా నెట్టుకొస్తున్నాడు. ఇప్పటికే వరుస పరాజయాలతో మార్కెట్ ను నాశనం చేసుకొన్న రాజ్ తరుణ్ “రాజుగాడు” సినిమాతో ఉన్న కాస్త మార్కెట్ ను పోగొట్టుకొని ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా ఖాళీగా కూర్చున్నాడు.
“కుమారి 21F” తర్వాత వచ్చిన భారీ క్రేజ్ ను బాగానే క్యాష్ చేసుకొన్న రాజ్ తరుణ్ మంచి కథలు ఎంచుకోకుండా కేవలం రెమ్యూనరేషన్ కే ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ ప్రారంభదశలో ఉండగానే పట్టాలు తప్పి బొక్కబోర్లా పడ్డాడు. ఇప్పుడైనా చేసిన తప్పు తెలుసుకొని మంచి కథతో మళ్ళీ కమ్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.