యాంకర్ లాస్యతో తన పెళ్లి వార్తను ఖండించిన హీరో రాజ్ తరుణ్

టాలీవుడ్‌లో వరుస విజయాలతో స్పీడ్‌గా దూసుకువెళ్తున్న యువ హీరో రాజ్ తరుణ్ తనపై వస్తున్న రూమర్లపై స్పందించాడు. ”ఉయ్యాల జంపాల”, ”సినిమా చూపిస్త మామ”, ”కుమారి 21F”, ”ఈడో రకం ఆడో రకం” సినిమాల వరుస హిట్స్‌తో మంచి ఊపుమీదున్న ఈ హీరోపై రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసింది. యాంకర్ లాస్యని ఈ కుర్ర హీరో ప్రేమించి.. లేపుకుని వెళ్లి పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది.

బుల్లితెరలో పాపులర్ అయిన లాస్య కొంత కాలంగా టీవీ షోలలో కనిపించపోయేసరికి ఇది నిజమని అందరూ భావించారు. దీంతో రాజ్ త‌రుణ్ నోరు విప్పాడు. సోషల్ మీడియాపై లాస్యతో పెళ్లి వార్తను ఖండించాడు. “కుమారి 21F ఆడియో వేడుకలో నేను ఒకసారి కలిసి మాట్లాడినందుకు లాస్యతో నా పెళ్లి చేసిన కొంతమందికి కృతజ్ఞతలు” అంటూ పెళ్లి పుకార్లు సృష్టించిన వారిపై సెటైర్ వేసాడు. “నేను ఎవరిని ప్రేమించలేదు. పెళ్లి చేసుకోలేదు. కనీసం మూడేళ్లవరకు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు” అని స్పష్టం చేసాడు. ఇప్పటికైనా రాజ్ తరుణ్ పై పెళ్లి వార్తలు ఆగుతాయేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus