ఎక్కడ మొదలుపెట్టాడో.. అక్కడికే వచ్చి చేరిన రాజ్ తరుణ్..!

తనకు కథ నచ్చాలే కానీ.. చిన్న హీరోలతో అయినా సరే సినిమాలు నిర్మించడానికి మన ‘కింగ్’ నాగార్జున ఎప్పుడూ రెడీగానే ఉంటుంటారు. గతంలో ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ ను ఆయన నిర్మించారు. ఇదే క్రమంలో రాజ్ తరుణ్ ను టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేసింది కూడా నాగార్జునే..! రాజ్ తరుణ్ హీరోగా పరిచయమైన ‘ఉయ్యాలా జంపాల’ చిత్రానికి నాగార్జునే నిర్మాత. అటు తరువాత రాజ్ తరుణ్ ‘సినిమా చూపిస్తా మావ’ ‘కుమారి 21ఎఫ్’ వంటి చిత్రాలతో క్రేజీ హీరోగా కూడా మారిపోయాడు. అయితే ఆ తరువాత అతని గ్రాఫ్ మొత్తం పడిపోయింది.

ఆ టైములో రాజ్ తరుణ్ నటించిన ‘ఈడో రకం ఆడో రకం’ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాలు తప్ప మరే సినిమా హిట్టవ్వలేదు. దిల్ రాజు నిర్మాణంలో చేసిన ‘లవర్’ ‘ఇద్దరి లోకం ఒక్కటే’ సినిమాలు కూడా పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం అక్టోబర్ 2న ఓటిటిలో విడుదల కాబోతుంది. దాని ఫలితం ఎలా ఉన్నా రాజ్ తరుణ్ కు కలిసొచ్చే అవకాశం అయితే లేదనే తెలుస్తుంది. ఇప్పుడు రాజ్ తరుణ్ తో పెద్ద నిర్మాతలు సినిమా చెయ్యడానికి కూడా ముందుకు రావడం లేదని తెలుస్తుంది.

ప్రస్తుతం రాజ్ తరుణ్ .. దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డితో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని నిర్మించడానికి నాగార్జున ముందుకొచ్చారట. అంతేకాదు స్క్రిప్ట్ విషయంలో కూడా నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ‘ఉయ్యాలా జంపాలా’ వంటి హిట్ సినిమా మాత్రమే కాదు… రాజ్ తరుణ్ – నాగార్జున కాంబినేషన్లో ‘రంగుల రాట్నం’ అనే పెద్ద ఫ్లాప్ సినిమా కూడా వచ్చిన సంగతి కూడా గుర్తించాల్సి ఉంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus