మాస్ ఇమేజ్ కోసం రాజ్ తరుణ్ ఆరాటం!

మన తెలుగులో హీరోలకంటే మాస్ హీరోల సంఖ్య ఎక్కువ. అందుకు కారణం కూడా లేకపోలేదు. “నా ప్రేమ మధురం” అనే సాఫ్ట్ టైటిల్ తో సినిమా తీస్తే ఎవరో ఒక స్టార్ హీరో నటిస్తే తప్ప కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా రావు. అదే “అడ్డొస్తే చంపేస్తా” అనే ఉరమాస్ టైటిల్ తో మాంచి నాటు సినిమా తీస్తే హీరో ఎవరనే విషయం కూడా పట్టించుకోకుండా ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కడతారు. ఇప్పటివరకూ మన తెలుగు చిత్రసీమలో ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన సినిమాలన్నీ మాస్ మసాలా ఎంటర్ టైనర్సే కావడం విశేషం. అంతెందుకు మన మెగాస్టార్ చిరంజీవి భారీ డైలాగులు, నరుక్కోడాలు లాంటివి లేకుండా “రుద్రవీణ” అనే సందేశాత్మక సినిమా తీస్తే నేషనల్ అవార్డ్ వచ్చించే కానీ.. సినిమాకి కనీసం పెట్టిన డబ్బులు కూడా రాలేదు. అదే చిరంజీవి కత్తి పట్టి “ఇంద్ర” సినిమాలో నటిస్తే బాక్సాఫీస్ బద్ధలైంది. అందుకే మన యువ హీరోలందరూ కెరీర్ స్టార్టింగ్ లో సాఫ్ట్ లవ్ స్టోరీస్ చేసినా తర్వాత మాత్రం మాస్ ఇమేజ్ కోసం ఆరాటపడుతుంటారు.

అందుకు మన యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా మినహాయింపేమీ కాదు. కెరీర్ స్టార్టింగ్ లో “ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21F” లాంటి సాఫ్ట్ మూవీస్ చేసిన రాజ్ తరుణ్ ఇప్పుడు మాస్ ఇమేజ్ సంపాదించుకోవడం కోసం కష్టపడుతున్నాడు. ఆల్రెడీ సంజనారెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న “రాజుగాడు” చిత్రంలో మాస్ రోల్ లో కనిపించనున్న రాజ్ తరుణ్ ఇటీవల మొదలైన “లవర్” చిత్రంలో మాస్ మెకానిక్ గా కనిపించనున్నాడట. మలయాళ ముద్దుగుమ్మ గాయత్రి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి “అలా ఎలా” ఫేమ్ అనీష్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మరి మాస్ హీరో అవ్వాలన్న రాజ్ తరుణ్ఆశ ఈ చిత్రంతో ఫలిస్తుందో లేక బెడిసికొడుతుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus