Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటం ఆనందంగా ఉంది.. ‘సారంగదరియా’ సక్సెస్ మీట్‌లో రాజా రవీంద్ర

సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటం ఆనందంగా ఉంది.. ‘సారంగదరియా’ సక్సెస్ మీట్‌లో రాజా రవీంద్ర

  • July 15, 2024 / 02:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటం ఆనందంగా ఉంది.. ‘సారంగదరియా’ సక్సెస్ మీట్‌లో రాజా రవీంద్ర

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘సారంగదరియా’. ఈ సినిమా జూలై 12న రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఆదివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..

రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘సారంగదరియాకు మీడియా నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. మాకు మంచి థియేటర్లు దొరికాయి. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. టెక్నికల్ టీం చాలా కష్టపడింది. ఈ టీంలో అందరూ మెచ్యూర్డ్ పర్సన్స్. మోయిన్, మోహిత్, యశస్విని నా కంటే చాలా బాగా నటించారు. అందరి పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఇదే నాకు హ్యాపియెస్ట్ మూమెంట్. నా కెరీర్‌లో ఇదొక మంచి చిత్రంగా నిలిచింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత శరత్ మాట్లాడుతూ.. ‘సారంగదరియా విడుదలై అన్ని థియేటర్లలో బాగా ఆడుతోంది. ఇంత రెస్పాన్స్ చూస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంది. నేను ఎన్నో సినిమాలు చూసి ఎంజాయ్ చేసిన థియేటర్లలో నా చిత్రానికి ఇంత మంచి ఆధరణ లభిస్తుండటం ఆనందంగా ఉంది. మొదటి రోజు తక్కువ మంది చూశారు. మౌత్ టాక్ వల్ల మెల్లిమెల్లిగా కలెక్షన్లు పెరుగుతున్నాయి. మంచి కథతో సినిమా తీశాం. మంచి కాన్సెప్ట్ అనే నమ్మకం ఉంది. మున్ముందు ఇంకా కలెక్షన్లు పెరుగుతాయన్న నమ్మకం ఉంది. సినిమాలోని ప్రతీ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మోయిన్, మోహిత్, యశస్విని కారెక్టర్‌లకు మంచి ఆధరణ లభిస్తోంది. మా దర్శకుడు సినిమా మీద ప్యాషన్ మస్కట్‌లో మంచి ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడకు వచ్చాడు. ఈ ఒక్క కథలోనే మూడు కథలు రాసుకున్నారు. ఇంత చిన్న వయసులో అంత మెచ్యూర్డ్ కథను ఎలా రాశారో అర్థం కాదు. టెక్నికల్ టీంతో చక్కగా పని చేయించుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేష్ ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. డీఓపీ గారు ఇచ్చిన విజువల్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం పని చేశారు. ఇంత మంచి సక్సెస్‌ను అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'భారతీయుడు 2' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 గూస్ బంప్స్ వచ్చేలా ‘క‌’ టీజర్.. కిరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!
  • 3 'బిగ్ బాస్' అశ్వినితో ఉన్న ఈ వ్యక్తి ఎవరు.. హాట్ టాపిక్ అయిన ఫోటో..!

దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి మాట్లాడుతూ.. ‘సారంగదరియా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా మీద ప్యాషన్‌తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. కెమెరా డిపార్ట్మెంట్‌లో ముందుగా పని చేశాను. చివరకు రాజా సర్ వద్దకు చేరాను. నేను కథ చెప్పిన వెంటనే ఓకే అన్నారు. నన్ను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించిన శరత్ గారికి థాంక్స్. సినిమాను బాగానే తీశాం. థియేటర్‌ కోసమే ఈ సినిమాను తీశాం. మా నిర్మాత గారు చాలా సపోర్ట్ చేయడంతోనే సినిమా ఇక్కడి వరకు వచ్చింది. డీఓపీ గారు నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఆయన వల్లే ఇంత గ్రాండియర్‌గా సినిమా వచ్చింది. మ్యూజిక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మోయిన్, మోహిత్, యశస్విని గారు చక్కగా నటించారు. రాజా సర్ అద్భుతంగా నటించారు. మా సినిమాను ఇంత ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత మహేష్ మాట్లాడుతూ.. ‘సారంగదరియా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్లు పెరుగుతున్నాయి. హౌస్ ఫుల్‌ అవుతున్నాయి. ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.

ఆదిత్య మ్యూజిన్ నిరంజన్ మాట్లాడుతూ.. ‘రాజా రవీంద్ర గారు అద్భుతంగా నటించారు. డెబ్యూ దర్శకుడిని నమ్మి ఆయన సాహసం చేశారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘సారంగదరియా విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ నడుస్తోంది. సోమవారం నుంచి మరిన్ని స్క్రీన్‌లు పెంచుతున్నాం. మౌత్ టాక్‌తో సినిమాకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. చూడని వాళ్లంతా మా సినిమాను చూడండి’ అని అన్నారు.

మోహిత్ మాట్లాడుతూ.. ‘సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని పాత్రలకు జనాల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. అందరూ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అందుకే అంత బాగా నటించగలిగాను. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన వారందరికీ థాంక్స్’ అని అన్నారు.

యశస్విని మాట్లాడుతూ.. ‘సారంగదరియా టీం వర్క్. అందరం కలిసి పని చేయడం వల్లే ఈ సక్సెస్ వచ్చింది. ఆర్టిస్టులం తెరపై కనిపిస్తాం. కానీ టెక్నీషియన్లు కనిపించరు. అన్ని పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రాజా సర్ నటనకు ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. ఇంత మంచి చిత్రంలో పార్ట్ అయినందుకు ఆనందంగా ఉంది. సాయిజా ప్రొడక్షన్స్ పెద్ద బ్యానర్‌గా మారాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మోయిన్ మాట్లాడుతూ.. ‘మా చిత్రంలో ఏ స్టార్ లేకపోయినా.. మీడియా నుంచి చాలా స్టార్లు వచ్చాయి. మా గురించి ఇంత బాగా రాసిన మీడియా వారికి థాంక్స్. మా సినిమాను ఇంకా జనాల వద్దకు చేర్చండి. మా చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raja Ravindra
  • #Saranga Dariya

Also Read

ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

related news

చిత్రాల‌యం స్టూడియోస్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’… శ‌ర‌వేగంగా మేఘాల‌య‌లో షూటింగ్‌!

చిత్రాల‌యం స్టూడియోస్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’… శ‌ర‌వేగంగా మేఘాల‌య‌లో షూటింగ్‌!

trending news

ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

2 hours ago
Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

3 hours ago
Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

8 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

18 hours ago
Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

20 hours ago

latest news

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

2 hours ago
అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

16 hours ago
Kingdom 2: ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

Kingdom 2: ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

16 hours ago
Ramayana: ‘సీత’మ్మ వారి కండీషన్లు.. ఆఫర్లు క్యూ కడుతున్నా సైలెన్స్ ఎందుకో?

Ramayana: ‘సీత’మ్మ వారి కండీషన్లు.. ఆఫర్లు క్యూ కడుతున్నా సైలెన్స్ ఎందుకో?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version