చిరుతో అభిప్రాయ భేధాలు!!!నిజమేనా???
- February 15, 2017 / 09:27 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో చిరంజీవి కాలిబెర్ గురించి అందరికే తెలిసిందే…అయితే అదే క్రమంలో టాలీవుడ్ టాప్ హీరోలు అయినటువంటి ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ తరం తరువాత ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి, అల్లు వారి అల్లుడుగా చిరు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా మంచి స్థానం సంపాదించుకున్నాడు అనే చెప్పాలి…అయితే అదే క్రమంలో చిరు ఇండస్ట్రీలో ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే…ఇదిలా ఉంటే అందరితో కలసి మేలాసి ఉండే చిరు…రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాక మళ్లీ సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు…..తన 150వ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ….చాలా గ్యాప్ తరువాత రావడంతో మంచి హిట్ అందుకున్నారు అనే చెప్పాలి….ఇదిలా ఉంటే తాజాగా బుల్లి తెర నటుడు ఒకరు చిరు గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుల్లి నటుడు రాజా రవీందర్….చిరుల మద్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఏది ఇంతవరకూ నిజమో అన్న విషయం పక్కన పెడితే…..ఇదే విషయమై స్పందించిన రాజా రవీంద్ర అసలు విషయం బయట పెడుతూ….మెగాస్టార్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన అంటే నాకు ప్రాణమని అంటున్నారు.
కాకపోతే ఆ మధ్యలో ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల నాకు చిరంజీవి తో గ్యాప్ వచ్చింది తప్ప ఆయనతో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసాడు నటుడు రాజా రవీంద్ర . చిరంజీవి తో పలు చిత్రాల్లో నటించడమే కాకుండా ఆ ఇంటికి సన్నిహితుడు గా కొనసాగిన రాజా రవీంద్ర సినిమాల్లో నటించినప్పటికీ చిరు రాజకీయాల్లోకి రాగానే ఆయన్ని ఫాలో అవ్వడం మానేసాడు. దీంతో చిరంజీవితో మనోడికి తెగతెంపులు అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. మొత్తంగా చూసుకుంటే చిరు రాజకీయ అరంగేట్రం వల్ల దూరమైన వాళ్ళలో మన రాజా రావీంద్రా కూడా ఒకరన్న మాట..
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














