రెండేళ్ల గ్యాప్ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ మూవీ ద్వారా అభిమానులను పలకరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అంధుడిగా అందరినీ అలరించారు. అందుకే ఈ చిత్రం రెండు రోజుల్లోనే 10 కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది. తమ హీరో హిట్ కొట్టాడనే సంతోషం ఆయన అభిమానులకు కొన్ని క్షణాలు కూడా మిగలలేదు. ఎందుకంటే ఈ మూవీ నెట్లో ప్రత్యక్షమవ్వడమే. సోషల్ మీడియాలో రాజా ది గ్రేట్ హల్ చల్ చేస్తోంది. దీంతో ఉలిక్కి పడిన చిత్ర బృందం పైరసీని అడ్డుకునే చర్యలను వేగవంతం చేసింది.
రాజా ది గ్రేట్ సినిమా పైరసీనీ ప్రోత్సహించకుండా నేరుగా థియేటర్లలోనే సినిమాని చూడమని నిర్మాత దిల్ రాజు విన్నవించారు. చిత్ర యూనిట్, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, సోషల్ మీడియా విస్తరించడంతో పైరసీని అరికట్టడం చాలా కష్టమవుతోంది. అందుకే రవితేజ అభిమానులు సైతం రాజా ది గ్రేట్ పైరసీ వీడియోల్ని డిలీట్ చేసే యజ్ఞంలో భాగస్వాములు అవుతున్నారు.