కొంచెం కామెడీ, కొంచెం రొమాన్స్, కొంచెం యాక్షన్.. కలగలిపిన ఇంట్రెస్టింగ్ ట్రైలర్..!

యువకథానాయకుడు కార్తికేయ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజా విక్రమార్క’. ఈ చిత్రాన్ని ‘శ్రీ చిత్ర మూవీ మేకర్స్’ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ గారి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన శ్రీ సరిపల్లి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.ఈ మధ్యనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతులమీదుగా విడుదల చేసిన ‘రాజా విక్రమార్క’ కు మంచి స్పందన లభించింది.

నవంబర్ 12న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ట్రైలర్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రం ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. హీరో కార్తికేయ ఈ చిత్రంలో ఎన్.ఐ.ఎ(జాతీయ దర్యాప్తు సంస్థ) ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. సినిమాల ప్రభావంతో ఇతను ఎన్.ఐ.ఎ ఏజెంట్ అవుతాడు. అటు తర్వాత మాత్రం అతను అనుకున్నట్టు ఏమీ అక్కడ ఉండదు. ఈ నేపథ్యంలో అతను ఎదుర్కొన్న పరిణామాలు ఆధ్యంతం అలరించే విధంగా ఉంటాయని ట్రైలర్ చెప్పకనే చెప్పింది.

ఈ ట్రైలర్ లో తనికెళ్ళ భరణి పలికిన సంభాషణలు బాగున్నాయి. ‘ఎలకని పట్టాలంటే వెనకపడనవసరం లేదు ఉల్లిపాయ వేస్తే చాలు’ అంటూ అతను పలికిన డైలాగ్ బాగుంది. కార్తికేయకి జోడీగా సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించింది. ట్రైలర్ లో ఈమె లుక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ’12 ఏళ్ళ అరణ్యవాసం ఏడాది అజ్ఞాతవాసం చేసాక పాండవులు కోరుకుంది కౌరవుల చావు కాదు ఓటమి’ అనే డైలాగ్ కూడా హైలెట్ అని చెప్పాలి. చందు సినిమాటోగ్రఫీ సూపర్,ప్రశాంత్ ఆర్. విహారి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus