NTR, Prabhas: అభిమానుల కలను జక్కన్న నిజం చేస్తారా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళికి క్లోజ్ గా ఉండే హీరోలలో ప్రభాస్, చరణ్, తారక్ ముందువరసలో ఉంటారు. ఈ ముగ్గురు హీరోల సినిమాలకు డైరెక్షన్ చేయడానికి, కెరీర్ పరంగా సలహాలు ఇవ్వడానికి రాజమౌళి ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే ఆర్.ఆర్.ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి మనస్సు మల్టీస్టారర్లపైకి మళ్లిందని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ మల్టీస్టారర్లను తెరకెక్కించాలని రాజమౌళి భావిస్తున్నారు. బడ్జెట్ విషయంలో, ఎక్కువ రోజులు షూట్ చేస్తున్నాననే విషయంలో తనపై వ్యక్తమవుతున్న విమర్శలకు చెక్ పెట్టాలని రాజమౌళి అనుకుంటున్నారని సమాచారం అందుతోంది.

2025 ఫస్టాఫ్ లో మహేష్ మూవీ విడుదలయ్యే ఛాన్స్ ఉందని ఈ విధంగా జరిగేలా రాజమౌళి పర్ఫెక్ట్ ప్లాన్ ను సిద్ధం చేశారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే మహేష్ మూవీ తర్వాత జక్కన్న ప్రభాస్ తారక్ కాంబోలో సినిమా ప్లాన్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. తారక్ హీరోగా నాలుగు సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి ప్రభాస్ హీరోగా మూడు సినిమాలను తెరకెక్కించారు. ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో సినిమా అంటే నమ్మాల్సి వస్తోందని ఫ్యాన్స్ సైతం చెబుతున్నారు.

అయితే జక్కన్న అధికారికంగా ప్రకటిస్తే మాత్రమే వైరల్ అవుతున్న గాసిప్స్ నిజమో కాదో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ వార్త నిజం కాకపోతే మాత్రం ఫ్యాన్స్ కూడా ఫీలయ్యే ఛాన్స్ ఉంది. రాజమౌళి ఫిక్స్ అయితే మాత్రం ఈ కాంబినేషన్ లో 1000 కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించి 3000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడం కష్టం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ మార్కెట్ ను అంచనాలకు అందని స్థాయిలో పెంచిన రాజమౌళి రాబోయే రోజుల్లో ఎలాంటి కథలతో సినిమాలను తెరకెక్కిస్తారో తెలియాల్సి ఉంది. సినిమా సినిమాకు దర్శకుడిగా రాజమౌళి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus