నేనే రాజు నేనే మంత్రి సినిమా యూనిట్ ని అభినందించిన రాజమౌళి
- August 11, 2017 / 01:29 PM ISTByFilmy Focus
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంత అప్డేట్ గా ఉన్నప్పటికీ తప్పకుండా తెలుగు చిత్రాలను చూస్తుంటారు. ప్రతి శుక్రవారం థియేటర్ కి వెళ్లి సినిమాని చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికపై వ్యక్తపరుస్తుంటారు. ఈ రోజు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాని చూసిన జక్కన్న ఆ చిత్ర టీమ్ ని అభినందించారు. ” సినిమాని తేజ గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రతీ ఒక్కరూ చాలా బాగా నటించారు. నా భళ్లాలదేవాను చూస్తే చాలా గర్వంగా ఉంది. కాజల్, కేథరిన్ లు మెప్పించారు. నవదీప్ మంచి రోల్ చేశారు.
ఓపెనింగ్ సీన్, క్లైమాక్స్ ట్విస్ట్.. సినిమాలో హైలెట్ గా నిలిచాయి. చాలా కాలం తర్వాత ఓ అర్థవంతమైన సినిమా వచ్చింది.” అని పోస్ట్ చేశారు. రాజమౌళి మాటలు “నేనే రాజు నేనే మంత్రి” చిత్ర బృందానికి ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా రానా కెరీర్ లో గొప్ప చిత్రం గా నిలిచి పోతుందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతుండడం విశేషం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














