Rajamouli: స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ షాట్ ఇదే.. ఏ సినిమా అంటే!

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సులువుగా 400 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. ప్రభాస్ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే సులువుగానే 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వస్తున్నాయి. స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ లోని బెస్ట్ సినిమా ఏదనే ప్రశ్నకు ఎక్కువమంది బాహుబలి సిరీస్ అని చెబుతారు.

Rajamouli

బాహుబలి1 (Baahubali) , బాహుబలి2 (Baahubali 2) సినిమాలు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి. అయితే ప్రభాస్ సినీ కెరీర్ లో బెస్ట్ షాట్ మాత్రం ఛత్రపతి (Chatrapathi) సినిమాలోని షాట్ కావడం గమనార్హం. దర్శకుధీరుడు రాజమౌళి (S. S. Rajamouli) ఒక సందర్భంలో ఈ విషయాలను వెల్లడించారు. ఒకే షాట్ లో రెండు మూడు ఎమోషన్స్ ను మిక్స్ చేస్తే ఆ షాట్ చేయడం సులువు కాదని జక్కన్న చెప్పుకొచ్చారు.

ఛత్రపతి సినిమాలో హీరో ఉండే కాలనీలో ఒక చిన్న పిల్లాడు కళ్లు లేని తల్లికి భోజనం తినిపిస్తూ ఉంటాడని వాళ్లిద్దరినీ చూసి హీరోకు తన తల్లి గుర్తుకు వస్తుందని రాజమౌళి పేర్కొన్నారు. ఒకవైపు తల్లిని తలచుకుని ఆనందం మరోవైపు ఆ పిల్లాడికి ఉన్న అదృష్టం తనకు లేదనే బాధ ఉంటుందని రాజమౌళి పేర్కొన్నారు. ఆ షాట్ లో ప్రభాస్ అద్భుతంగా నటించాడని ఆ షాట్ ప్రభాస్ బెస్ట్ షాట్ అని జక్కన్న పేర్కొన్నారు.

ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ (The Rajasaab) సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు సంబంధించి దసరాకు ఏవైనా అప్ డేట్స్ వస్తాయో చూడాల్సి ఉంది. దసరాకు ఎలాంటి అప్ డేట్స్ రాకపోతే మాత్రం ప్రభాస్ పుట్టినరోజు కానుకగా కచ్చితంగా అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ తర్వాత సినిమాలు సైతం భారీ స్థాయిలో తెరకెక్కుతుండగా ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

‘విశ్వం’ టీం రాంగ్ ప్లానింగ్.. ముందే రిలీజ్ చేస్తే బాగా ప్లస్ అయ్యేది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus