Rajamouli, Mahesh Babu: రాజమౌళి – మహేష్‌ సినిమాపై ఇంట్రెస్టింగ్‌ రూమర్‌!

రాజమౌళి సినిమాలు చూస్తే… హాలీవుడ్‌ రేంజిలో ఉన్నాయి అంటారు కొందరు. ఇంకొందరేమో నాలుగైదు హాలీవుడ్‌ సినిమాలు కలిపి తీసినట్లు ఉన్నాయి అంటారు. రెండూ కరెక్టే. ఎందుకంటే ఆయన సినిమాల స్థాయి హాలీవుడ్‌ది. ఆయన సినిమాల వెనుక స్ఫూర్తి కూడా హాలీవుడ్డే. అయినా ఆలోచన తీసుకొని… తనదైన శైలిలో చూపించడం తప్పేముంది. ఇదంతా పక్కనపెడితే రాజమౌళి సినిమాల కథల మూలం ఎక్కడో ఏదో సినిమానో, కథో,నవలో ఉంటుంది అనే మాటలూ వినిపిస్తుంటాయి. తాజాగా మహేశ్‌బాబు చేస్తానంటున్న సినిమా కూడా అంతే అట.

మహేశ్‌బాబుతో రాజమౌళి సినిమా అని చాలా ఏళ్లుగా వినిపిస్తోంది. ఇదిగో సినిమా అనుకునేలోపే వేరే ఏదో ప్రాజెక్టులో ఇద్దరూ బిజీ అయిపోయి ఈ సినిమా ముందుకెళ్లడం లేదు. అయితే ఈసారి పక్కగా సినిమా చేస్తారు అంటున్నారు. దీని కోసం విజయేంద్ర ప్రసాద్‌ ఇప్పటికే కథ సిద్ధం చేస్తున్నారని కూడా టాక్‌. అటవీ నేపథ్యంలో సాగే సినిమా అని, సాహసోపేతంగా ఉంటుందని కూడా అంటున్నారు. అంతే కాదు ఈ సినిమా కోసం ఓ నవల రైట్స్‌ను కొంటున్నారు కూడా అట.

ద‌క్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ ర‌చ‌యిత స్మిత్ రాసిన ప్రఖ్యాత న‌వ‌ల ఆధారంగా ఈ సినిమాని తీయ‌బోతున్నార‌ట. అందుకే ఆ న‌వ‌ల రైట్స్ ని కొనుగోలు చేశార‌ని స‌మాచారం. అయితే ఆ నవ‌ల‌ను తీసుకున్నా… ఇక్క‌డి వాతావ‌ర‌ణానికి తగ్గట్టుగా మార్పులు చేసి సినిమా చేస్తారట. ఇలాంటి పనుల్లో రాజమౌళి సిద్ధహస్తుడే కదా. ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేస్తున్నారట.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus