Rajamouli: టెక్నీషియన్ల విషయంలో మార్పులు.. రాజమౌళి ప్లానింగ్ కరెక్టేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి తన సినిమాలకు రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా అందుకుంటున్నారు. మహేష్ సినిమాను జక్కన్న భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా 2026 చివర్లో లేదా 2027 మొదట్లో రిలీజయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు టెక్నీషియన్ల విషయంలో సైతం జక్కన్న కీలక మార్పులు చేస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ సినిమా టెక్నీషియన్ల విషయంలో జక్కన్న ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని కొంతమంది టెక్నీషియన్లను మార్చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పీఎస్ వినోద్ పని చేయనున్నారని విజువల్ ఎఫెక్స్ట్ సూపర్ వైజర్ గా కమల్ కన్నన్ పని చేయనున్నారని సమాచారం అందుతోంది. గతంలో జక్కన్న సినిమాలకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా, శ్రీనివాస మోహన్ విజువల్ ఎఫెక్స్ట్ సూపర్ వైజర్ గా పని చేశారు. టెక్నీషియన్ల మార్పు గురించి రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ కావడంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జక్కన్న అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.

హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం ఈ సినిమా కోసం పని చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని భోగట్టా. రాజమౌళి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరికి ఛాన్స్ ఇస్తారనే చర్చ సైతం జరుగుతోంది. మహేష్ ఈ సినిమా కోసం లుక్ ను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన స్క్రిప్ట్ ను ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్ (Rajamouli) జక్కన్న కాంబో ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్ లో ఉండబోతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంచనాలను మించి పెరుగుతోంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus