Rajamouli, Chiranjeevi: మెగా ఫ్యాన్స్ కోరికను జక్కన్న తీరుస్తారా..?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కోసం మెగాఫ్యాన్స్ చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ లో నటించి మెప్పించారు. అయితే భవిష్యత్తులో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని తెలుస్తోంది. మహాభారతం రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అనే సంగతి తెలిసిందే. రాజమౌళి కొన్నేళ్ల తరువాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను తప్పకుండా తెరకెక్కిస్తానని గతంలో వెల్లడించారు.

ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం జక్కన్న మెగాస్టార్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా నటిస్తారని తెలుస్తోంది. రాజమౌళి కంప్యూటర్ ఇంటర్ ఫేస్ టెక్నాలజీ సహాయంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని రాజమౌళి స్థాయిని మరింత పెంచే విధంగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. రాజకీయాలకు పూర్తిగా దూరమైన మెగాస్టార్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు.

మహేష్ బాబు సినిమా తరువాత రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను తెరకెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మరి రాజమౌళి చిరంజీవికి మహాభారతంలో ఏ పాత్ర ఇస్తారో చూడాల్సి ఉంది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి చిరంజీవిని మాత్రమే హీరోగా పెట్టి ఒక సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి తన సినీ కెరీర్ లో సీనియర్ స్టార్ హీరోలను మెయిన్ హీరోగా పెట్టి సినిమాలను తెరకెక్కించలేదు. రాబోయే రోజుల్లో చిరంజీవి హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతుందేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus