టాలీవుడ్ స్టామినా ఏంటో ఒక్క సినిమాతో ప్రపంచ వ్యాప్తం చేశాడు మన టాప్ దర్శకుడు రాజమౌళి…అయితే ఇప్పటివరకూ ఫ్లాప్ అన్న పధం వినని దర్శకుడిగా…రాజమౌలికి మంచి పేరు ఉంది…అయితే అదే క్రమంలో బాహుబలి1తో ప్రపంచాన్ని ఒక్కసారిగా టాలీవుడ్ వైపు తిరిగేలా చేసిన జక్కన్న ఇప్పుడు బహుబలి-2 విషయంలో సైతం అంటే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు…అయితే బాహుబలి2 పై అనేక విమర్శలు వస్తున్నాయి….ఈ సినిమాలో కధ విషయం ఎలా ఉన్నా…ఈ సినిమా ట్రైలర్ లో కొన్ని సీన్స్ ను చూస్తే రాజమౌళి…ఈ సినిమాలోని కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ చేశాడు అని విమర్శలు వస్తున్నాయి…అయితే వాటిల్లో ఎంత నిజం ఉందో…తెలీదు కానీ…ఇదే విషయమై జక్కన్న స్పందిస్తూ….యుద్దం నేపధ్యం ఉన్న సినిమాలు తీసే సమయంలో అందరూ అలానే మాట్లాడతారు…. అదే క్రమంలో ప్రభాస్ శత్రువుల బాణలకు ఎదురు వెళ్లే సీన్ హాలీవుడ్ సినిమా హర్క్యులెస్ లోనుంచి కాపీ కొట్టింది…అన్న విమర్శలపై స్పందిస్తూ… యుద్దాల్లో హీరోలు అలా కాకపోతే ఎలా ఉంటారు.
అంతేకాదు…ప్రతీ యుద్దం కధ ఇలానే ఉంటుంది అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు..అంతేకాదు….సినిమా మొత్తం చూడకుండా ఒక సీన్ తో ఎలా చెప్పేస్తారు సినిమా కాపీ అని…అంటూ క్రిటిక్స్ కి కాస్త ఘాటుగానే సమాధానం చెప్పాడు ఈ డైనమిక్ దర్శకుడు…కధ అంతటితో ముగిసి పోతే బాగానే ఉండేది కానీ…అసలు కధ అక్కడే మొదలయ్యింది….రాజమౌళి వాదనతో క్రిటిక్స్ ఏకీభవించలేదు…అలా చెయ్యక పోగా…జక్కన్న చెప్పిందే నిజం అయితే హాలీవుడ్ సినిమాల్లో 300, ట్రాయ్ రెండు సినిమాలు యుద్దం నేపధ్యంలో సాగిన సినిమాలే కానీ ఎక్కడా ఒక సినిమాలో వచ్చిన సన్నివేశం రెండో సినిమాలో రాదు…అంటూ రివెర్స్ కౌంటర్ వేశారు….మొత్తానికి అదీ జక్కన్నకు…మీడియాకు మధ్య మ్యాటర్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.