స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆలోచనలు ఇతర దర్శకుల ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి. జక్కన్న ఎలాంటి సినిమాను తెరకెక్కించినా ఆ సినిమాతో కచ్చితంగా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటారనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరడం ఖాయమని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మలయాళ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి తెరకెక్కించే భారీ బడ్జెట్ సినిమాలలో తెరపై వేల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్ట్ లు కనిపిస్తారనే సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ సినిమా కొరకు ఏకంగా 3,000 మంది జూనియర్ ఆర్టిస్టులు పని చేశారని రాజమౌళి వెల్లడించారు. జూనియర్ ఆర్టిస్టులు వారి పనులు వాళ్లు చేసుకుంటూ ఉండాలని అలా చేసే విధంగా కో డైరెక్టర్లు వాళ్లకు చెప్పాలని తెలిపారు. కానీ మనవాళ్లు చెప్పరు అంటూ జక్కన్న చెప్పుకొచ్చారు. మలయాళ సినిమాలలో జూనియర్ ఆర్టిస్టులు కూడా పర్ఫెక్ట్ గా నటిస్తారని మనం అలా ఎందుకు చేయలేమని సిగ్గేస్తుందని రాజమౌళి తెలిపారు.
ఆ కాలానికి తగిన కాస్ట్యూమ్స్ ను జూనియర్ ఆర్టిస్టులకు వాడామని ఈ సినిమాలో సెట్ వర్క్ న్యాచురల్ గా ఉంటుందని రాజమౌళి వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ మూవీని చూస్తే 1920 కాలానికి వెళ్లినట్టు కచ్చితంగా అనిపిస్తుందని రాజమౌళి పేర్కొన్నారు. రాజమౌళి తన ప్రతి ఇంటర్వ్యూ ద్వారా ఆకాశమే హద్దుగా ఆర్ఆర్ఆర్ పై అంచనాలను పెంచేశారు. ఆర్ఆర్ఆర్ కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద క్రియేట్ అయిన ఎన్నో రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు 150 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.