Rajamouli: రాధేశ్యామ్ ను చూసి రాజమౌళి అలా అన్నారా?

స్టార్ హీరో ప్రభాస్ కు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ సినిమాల ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా ఈ నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా నిడివి 150 నిమిషాలని రాధేశ్యామ్ సెకండాఫ్ లోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని సమాచారం అందుతోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమాకు థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించగా రాజమౌళి వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. రాజమౌళి ఇప్పటికే రాధేశ్యామ్ ను చూశారని ఈ సినిమా గురించి ఆయన పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. అయితే రాజమౌళి చిన్నచిన్న మార్పులు చెప్పారని రాధేశ్యామ్ మేకర్స్ కూడా జక్కన్న సూచనలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారని సమాచారం. రాజమౌళి ఒకవైపు తన డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉంటూనే మరోవైపు రాధేశ్యామ్ సినిమాకు తన వంతు సహాయం చేస్తుండటం గమనార్హం.

రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ ఒకే నెలలో రిలీజ్ అవుతుండటంతో ఈ రెండు సినిమాల ఫలితాల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ అభిమానులకు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియా యాక్టివిటీని మరింత తగ్గించాలని అనుకుంటున్నానని ప్రభాస్ తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా లేరు. ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఈ హీరోకు అభిమానుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

మార్చి 11వ తేదీన రిలీజ్ కానున్న రాధేశ్యామ్ విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ కు ఇతర వంటకాలతో పోల్చి చూస్తే పులస చేప అంటే ఎక్కువ ఇష్టమని సమాచారం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus