కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లను దాటుకుని ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. తారక్, చరణ్ ఈ సినిమాలో హీరోలుగా నటించడంతో పాటు తమ కెరీర్ లో విలువైన సమయాన్ని ఈ సినిమా కొరకు కేటాయించారు. తారక్, చరణ్ ఈ సినిమాల కోసం చెరో 45 కోట్ల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది. దాదాపుగా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా బడ్జెట్ లో దాదాపుగా 200 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ కోసమే ఖర్చు చేశారని తెలుస్తోంది. సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యం కావడంతో నిర్మాతపై వడ్డీల భారం ఊహించని స్థాయిలో పెరిగింది. ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్ లో దాదాపుగా 100 కోట్ల రూపాయలు నిర్మాత వడ్డీ భారమే అని సమాచారం అందుతోంది. అయితే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ఆలస్యం కావడం వల్ల చరణ్, తారక్ రెమ్యునరేషన్లను తగ్గించుకున్నారా? అనే ప్రశ్న ఎదురైంది.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆ ప్రశ్నకు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ కొరకు చరణ్, తారక్ ఇప్పటికే చాలా త్యాగాలు చేశారని కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్న సమయంలో ఆర్ఆర్ఆర్ కొరకు నాలుగేళ్ల సమయం కేటాయించారని వేర్వేరు కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమైనా ఓపికగా ఎదురుచూశారని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ కొరకు చరణ్, తారక్ విపరీతంగా కష్టపడ్డారని జక్కన్న తెలిపారు. సినిమా కోసం ఇంత చేసిన హీరోలు ఇంకా పారితోషికాలు తగ్గించుకోవడం ఏమిటని రాజమౌళి ప్రశ్నించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన తర్వాత ఈ సినిమా కోసం ఇంత సమయం కేటాయించడంలో తప్పు లేదని అనిపిస్తుందని నా దృష్టిలో బాహుబలి కంటే ఆర్ఆర్ఆర్ పెద్ద సినిమా అని రాజమౌళి అభిప్రాయపడ్డారు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!