Rajamouli: తన హీరోల గురించి జక్కన్న ఆసక్తికర కామెంట్స్‌!

రాజమౌళి తన యాక్టర్స్‌ నుండి 100 పర్సంట్‌ ఇంకా కుదిరితే 110 పర్సంట్‌ టాలెంట్‌ను బయటకు తీస్తారు అని ఇండస్ట్రీలో టాక్‌. అందుకే ఆయన సినిమాల్లో హీరోలు గత చిత్రాలకు భిన్నంగా కనిపిస్తారట. ఎక్కడో తెలియని కొత్తదనం, భారీతనం కనిపిస్తాయి ఆయన సినిమాల్లో, నటుల నటనలో. మరి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోలు రామ్‌చరణ్‌, తారక్‌ నటన గురించి ఏమనుకుంటున్నారు అనేది ఆసక్తికరమే కదా. అంతేకాదు ఈ ఇద్దరి హీరోలను తొలి రోజుల నుండి గమనిస్తూనే ఉన్నారు జక్కన్న. అందుకే తారక్‌, చరణ్‌ నటన గురించి జక్కన ఏమన్నారో చూద్దాం.

Click Here To Watch Now

రాజమౌళి, తారక్‌ కెరీర్‌ తొలి నాళ్ల నుండే పని చేస్తున్నారు. ఇప్పటివరకు తారక్‌తో రాజమౌళి నాలుగు సినిమాలు చేశారు. మరి తారక్‌ నటన గురించి ఏం చెబుతారు అంటే జక్కన్న షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ‘తారక్‌ అస్సలు నన్ను సర్‌ప్రైజ్‌’ చేయలేడు అని అన్నారు. ఎందుకంటే తారక్‌ నటన గురించి తనకు అణువణువూ తెలుసని, ఏ సీన్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తాడు, ఎలాంటి బాడీ లాంగ్వేజ్‌ చూపిస్తాడు, డైలాగ్‌ డెలివరీ అనేది తాను చెప్పేయగలనని అన్నాడు.

అందుకే సీన్‌ చెప్పేసి ఊరుకుంటే తారక్‌ నటించేసి చూపిస్తాడని.. అంతా ఓకే అనుకుంటే కట్‌ టేక్‌ ఓకే చెప్పేయడమే అని చెప్పారు రాజమౌళి. ఇక చరణ్‌ నటన గురించి మాట్లాడుతూ ఇన్నేళ్ల చరణ్‌ కెరీర్లో చరణ్‌లో విచిత్రమైన వ్యక్తితత్వం చూశాను అని చెప్పారు రాజమౌళి. కథ గురించి, నటన గురించి ఎక్కువగా ఆలోచించకుండా… జస్ట్‌ మైండ్‌ను కామ్‌గా పెట్టుకుంటాడు. ఇన్నేళ్లలో ఈ గొప్ప విషయం నేర్చుకున్నాడు. అందుకే నేను సీన్‌ చెప్పగానే తనను తాను సెట్‌రైట్‌ చేసుకొని నటించేస్తాడు.

ఎక్కువ ఆలోచించకుండా… దర్శకుడు చెప్పింది చేసేస్తాడు. ఒక్కోసారి నేనే సర్‌ప్రైజ్‌ అవుతుంటాను. ఒక్కోసారి నేను ఊహించిన దాని కంటే ఎక్కువ చేసేస్తాడు. అలా ఇద్దరూ వేర్వేరు రకాలు అని చెప్పిన రాజమౌళి. ఇద్దరూ నాకు స్నేహితులు అనే కన్నా, నేను వారి పెద్ద అన్నను అని అనుకుంటాను అని చెప్పారు రాజమౌళి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus