Rajamouli, Mahesh Babu: మహేష్ బాబుకి ఏం ఎలివేషన్ ఇచ్చాడబ్బా రాజమౌళి.. వీడియో వైరల్!

  • March 19, 2024 / 02:26 PM IST

జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) స్పెషల్ స్క్రీనింగ్‌ జరిగింది. దీనికి దర్శకుడు రాజమౌళి (SS Rajamouli)  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆర్.ఆర్.ఆర్’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ముందుగా అనుకున్న క్లైమాక్స్ లో హీరోయిన్ ఒలీవియా మోరిస్ పాత్ర చనిపోతుందని, ఆ స్యాడ్ ఎండింగ్ ఇష్టం లేక మార్చేసి హ్యాపీ ఎండింగ్ ఇచ్చామని’ రాజమౌళి చెప్పుకొచ్చాడు. అలాగే తన నెక్స్ట్ మూవీ గురించి కూడా రాజమౌళి ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. రాజమౌళి మాట్లాడుతూ.. “నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన రైటింగ్ వర్క్ కంప్లీట్ అయ్యింది.

ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ ఇంకా క్యాస్టింగ్ ఫైనల్ కాదు. హీరో మాత్రమే ఫైనల్ అయ్యాడు. అతని పేరు మహేష్ బాబు(Mahesh Babu). తెలుగు యాక్టర్. మీలో చాలా మందికి ఆయన తెలుసనుకుంట..! మహేష్ చాలా అందగాడు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి రిలీజ్ టైమ్‌ కి అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేస్తాను” అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

మరోపక్క ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ పెద్ద సెట్‌ వేస్తున్నారు. మే నెల నాటికి ఈ సెట్‌ పనులు పూర్తవుతాయి. ఆ తర్వాత షూటింగ్‌ ప్రారంభించే ఛాన్స్ ఉంది.దానికి ముందు ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టి.. ఈ ప్రాజెక్టు గురించి మరింత క్లారిటీ ఇవ్వడానికి రాజమౌళి అండ్ టీం రెడీ అవుతుంది.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus