NTR, Ram Charan remuneration: ఎన్టీఆర్- చరణ్ ల ఫ్రెండ్షిప్ గురించి రాజమౌళి ఫన్నీ కామెంట్స్..!

మరో వారం రోజుల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్.ఆర్.ఆర్ సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు దర్శకుడు మరియు ఈ చిత్రం హీరోలు. గత మూడున్నరేళ్ళుగా వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనం చూడలేదు కానీ గత 4,5 రోజులుగా వాళ్ళు క్షణం తీరిక లేకుండా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇందుకోసం వాళ్ళు స్లీప్ లెస్ నైట్స్ ను గడుపుతున్నట్టు కూడా వినికిడి.

Click Here To Watch Now

అయితే ప్రమోషన్లలో భాగంగా ఈ ఇద్దరు హీరోలు దర్శకుడితో కలిసి చేసే ఫన్ మాత్రం మాములుగా ఉండడం లేదు. నిన్న హిందీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, చరణ్ తమ ప్లాప్ సినిమాల గురించి చేసిన కామెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూలో అయితే ఫన్ అల్టిమేట్ అన్నట్టు ఉంది. ఇక ఈ ప్రమోషనల్ లో భాగంగా.. హీరోల పై దర్శకుడు రాజమౌళి వేసే సెటైర్లు కూడా హైలెట్ గా నిలుస్తున్నాయి.

తారక్ భయంకరమైన ట్రబుల్ మెన్ అని, చరణ్ ను అస్తమాను కెలుకుతూ ఉంటాడని రాజమౌళి చెప్పి నవ్వులు పూయించాడు. ఇక వీరి పారితోషికాల గురించి కూడా ప్రశ్నలు ఎదురైనప్పుడు చరణ్.. ‘నా రెమ్యూనరేషన్ కూడా తారకే మాట్లాడాడు’ అంటూ ఫన్నీ కామెంట్ చేసాడు. అప్పుడు రాజమౌళి.. ‘అక్కడి నుండే వీళ్ళ ఫ్రెండ్ షిప్ మొదలై ఉంటుంది. నాకు నీకు తక్కువ కాకుండా సమానంగా ఎక్కువ కావాలని చరణ్- ఎన్టీఆర్ డీల్ కుదుర్చుకుని ఉంటారు.

అందుకే వీళ్ళ ఫ్రెండ్షిప్ బాగా బిల్డ్ అయ్యింది అంటూ రాజమౌళి చెప్పి నవ్వులు పూయించాడు. ఇదిలా ఉండగా.. ఓవర్సీస్లో ‘ఆర్.ఆర్.ఆర్’ టికెట్ల కోసం ఈ హీరోల అభిమానులు అలాగే సినీ అభిమానులు ఎలా ఎగబడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రల్లో అయితే బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. టికెట్ రేట్ల హైక్స్ విషయంలో కూడా ఏపి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus