రాజీపడ్డ రాజమౌళి…కారణం???

  • April 3, 2017 / 06:03 AM IST

టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు…అయితే అందులో టాప్ పొసిషన్ లో ఉంటాడు మన జక్కన్న….విషయంలోకి వెళితే….తన మొదటి సినిమా నుంచి….ఇప్పటి బాహుబలి వరకూ రాజమౌళిని ఫ్లాప్ అన్న పదం ఎందుకు టచ్ చెయ్యలేదంటే…..సినిమా విషయంలో తాను తీసుకునే శ్రద్ధ అలాంటిది….అయితే క్వాలిటీ విషయంలో ఏమాత్రం ఈమాత్రం  కాంప్రమైజ్‌ కాడు ఈ దర్శకుడు….ఎంత లేట్ అయినా…ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కానీ….సినిమా క్వాలిటీ విషయంలో మాత్రం కాంప్రమైస్ కాడు….బహుశా ఈ మనస్తత్వం వల్లనే ఫెయిల్యూర్ అన్న పదం రాజమౌళిని ఇప్పటి వరకు పలకరించలేక పోయింది అంటే అతిశయోకి కాదు….. అదే క్రమంలో ఈ జాగ్రత్త వల్లే….జక్కన్న ఇప్పటివరకు తీసిన ఏసినిమా డెడ్‌ లైన్‌ కు విడుదల కాలేదు. ఎదో కారణాలు వల్ల గతంలో అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చాయి. అంతెందుకు తాజా సినిమా  ‘బాహుబలి’ పార్ట్ 1 కూడ రెండేళ్ళ క్రితం తాను టార్గెట్ చేద్దాము అనుకున్న సమ్మర్ రేస్ ను మిస్ చేసుకుని సమ్మర్ పూర్తి అయ్యాక జూలైలో వచ్చింది. దీనికారణం అప్పట్లో ఈసినిమాకు జరిగిన లాస్ట్‌ మినిట్‌ కరక్షన్స్‌.

అయితే ఇప్పుడొస్తున్న ‘బాహుబలి 2’ ని మాత్రం అనుకున్నట్టుగా ఎటువంటి మార్పులు లేకుండా ఏప్రిల్‌ 28నే రిలీజ్‌ చేస్తున్నాడు ఈ దర్శకుడు….దానికి గల కారణాలు ఏంటి అంటే…ఈసినిమాకు జరిగిన అత్యంత భారీ బిజినెస్. ఈ మూవీని భారీ రేట్లు పెట్టి హక్కులు తీసుకున్నవారంతా ఖచ్చితంగా వేసవిలోనే సినిమా విడుదల చేయాలని కండిషన్‌ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తాము పెట్టిన భారీ మొత్తాలు రికవర్‌ కావాలంటే ఒక్క సమ్మర్ సీజన్లో తప్ప మరి ఏ సీజన్లో బెస్ట్ కాదని తేల్చి చెప్పడంతో రాజమౌళి తన ‘బాహుబలి 2’ ను  ఏప్రిల్‌ 28న రిలీజ్‌ చేయడం కోసం ఎటువంటి లాస్ట్‌ మినిట్‌ కరక్షన్ల జోలికి వెళ్ళడంలేదు అని టాక్. గ్రాఫిక్స్‌ పరంగా విపరీతమైన శ్రద్ధ తీసుకునే రాజమౌళి ఈ గ్రాఫిక్స్ విషయంలో చిన్నచిన్న తప్పులు కనిపించినా వాటిని పట్టించుకోకుండా అవుట్‌పుట్‌ బాగుందనిపిస్తే చాలు ఇక వంకలు పెట్టకుండా ఓకె చేస్తున్నట్లు టాక్. మొత్తంగా బాహుబలిని తీర్చిదిద్దిన చక్రవర్తి అలసిపోయి చివరకు రాజీ పడిపోయాడన్నమాట.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus