Rajamouli: 100 వేరియషన్లు.. 18 టేక్‌లు.. ‘నాటు నాటు’ పాట షూట్‌లో జరిగిన ఆసక్తికర విషయాలివీ!

భారతీయుల చిరకాల కోరిక నెరవేరింది. తెలుగు ప్రేక్షకులకు, భారతీయ ప్రేక్షకులకు బ్లాక్‌బస్టర్‌లు ఇచ్చిన రాజమౌళి.. అదే చేత్తో భారత్‌కు ఓ ఆస్కార్‌ పురస్కారం కూడా వచ్చేలా చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్‌ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పాట కోసం జక్కన్న అండ్‌ టీమ్‌, రామ్‌చరణ్‌, తారక్‌ చాలా కష్టపడ్డారు. ఆ విషయాలను చాలా రోజులుగా టీమ్‌ చెబుతూనే ఉంది. అయితే ఆస్కార్‌ దక్కిన ఆనందంలో గతంలో ఏం జరిగింది తెలుసుకోవడం బాగుంటుంది కదా.

ఓ పాటలా మొదలైన ‘నాటు నాటు..’ ప్రభంజనంలా మారడానికి రామ్‌చరణ్‌, తారక్‌ స్టెప్పులు… కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ గాత్రం, చంద్రబోస్‌ సాహిత్యం.. అన్నింటికీ మించి కీరవాణి సంగీతం కారణం. అయితే ఇవన్నీ ఓ మోతాదులో పడి హిట్‌ అవ్వడానికి రాజమౌళి కారణం. ఈ పాట చిత్రీకరణ సమయంలో రాజమౌళి హెడ్‌ మాస్టర్‌ కంటే స్ట్రిక్ట్‌గా వ్యవహించారట. ఆ మాటకొస్తే ఆయన ప్రతి సీన్‌కి అలానే ఉంటారు అనుకోండి.

అయితే ఈ పాట కోసం రామ్‌చరణ్‌, తారక్‌ స్టెప్పులు వేసినప్పడు ఇద్దరికీ సింక్‌ ఉండేలా చూడటం కోసం ఇంచీల లెక్కన కొలిచి స్టెప్పులు వేయించరాట. ఈ పాట కోసం కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్ 100కిపైగా వేరియేషన్లు ఇవ్వగా.. ఐకానిక్‌ స్టెప్‌ కోసం రాజమౌళి ఏకంగా 18 టేక్‌లు తీసుకున్నారట. పర్‌ఫెక్ట్‌ సింక్‌ వచ్చేంతవరకు స్టెప్పులు వేయించారట. అయితే రెండో టేక్‌నే తీసుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని ‘ఆర్‌ఆర్ఆర్‌’ ప్రచారం సమయంలో చెప్పుకొచ్చారు కూడా.

అంతగా లెక్కలేసి.. పాట తీశారు కాబట్టే.. ఇప్పుడు ప్రపంచ వేదిక మీద మన సినిమాను అంతెత్తున నిలబెట్టింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఓ స్టెప్‌కి ముందు ఒలీవియా మోరిస్‌ సస్పెండర్స్ లాగి వదిలినప్పుడు తారక్‌, రామ్‌చరణ్‌కు గట్టిగా తాకాయట. ఆ నొప్పితో కూడా వాళ్లు డ్యాన్స్‌ చేశారని రాజమౌళి చెప్పారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి ఈ షూటింగ్‌ టైమ్‌లో. ఆ కష్టమే ఇప్పుడు అవార్డు తెచ్చిపెట్టింది అని చెప్పొచ్చు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus