బాహుబలి కంక్లూజన్ లో చిరంజీవి వార్తలపై స్పందించిన జక్కన్న!

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి బిగినింగ్ కి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రభాస్ ద్వి పాత్రాభినయం చేసిన ఈ మూవీ ట్రైలర్ ని ఈ నెలలో రిలీజ్ చేయడానికి జక్కన్న శ్రమిస్తున్నారు. ఏప్రిల్ 28 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి మాట సాయం చేయనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టింది.

బాహుబలి పార్ట్ 2 మొదలయ్యే ముందు బాహుబలి పార్ట్ ఒకటిలో జరిగిన విశేషాలను చిరు  వాయిస్ తో వివరించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. బాహుబలి పార్ట్ 2కి క్రేజ్ పెంచడానికి జక్కన్న ఈ ప్లాన్ వేశారని చెప్పుకున్నారు. అయితే ఇవి కేవలం పుకార్లని తేలిపోయింది. ఈ రోజు ఉదయం రాజమౌళి బాహుబలికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. దీంతో ఈ రూమర్లకు బ్రేక్ పడింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus