Rajamouli: పిల్ పై జక్కన్న ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

చరణ్, తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఆర్ఆర్ఆర్ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. కరోనా కేసుల వల్ల ఈ నెల 7వ తేదీన విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ మరోసారి పోస్ట్ పోన్ అయింది. సమ్మర్ లోనే ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజవుతుందని చరణ్, ఎన్టీఆర్ అభిమానులు సైతం ఫిక్స్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ వాయిదా వల్ల నిర్మాత దానయ్యకు ఏకంగా 50 కోట్ల రూపాయల నష్టమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.

అల్లూరి సౌమ్య తెలంగాణ హైకోర్టులో ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ చరిత్రను వక్రీకరించారని పిల్ దాఖలు చేయగా జక్కన్న ఫ్యాన్స్ మాత్రం ఈ పిల్ పబ్లిసిటీ స్టంట్ అని చెబుతున్నారు. రాజమౌళి చాలా సందర్భాల్లో ఈ సినిమా ఫిక్షన్ అని చెప్పారని వాళ్లు గుర్తు చేస్తున్నారు. రాజమౌళి సైతం ఈ కథ ఢిల్లీలో జరిగిన ఫిక్షనల్ కథ అని తెలిపారు. పాత్రల పేర్లను తీసుకొని పూర్తి ఫిక్షనల్ కథాంశంతో ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కించానని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు చాలా సమయం ఉండటంతో ఈ పిల్ ప్రభావం సినిమాపై పెద్దగా ఉండదని చరణ్, తారక్ అభిమానులు భావిస్తున్నారు. ఈ పిల్ విషయంలో కోర్టు ఏ విధంగా జడ్జిమెంట్ ఇస్తుందో చూడాల్సి ఉంది. గతంలో కూడా స్వాతంత్ర సమరయోధుల పేర్లతో పలువురు దర్శకులు ఫిక్షనల్ కథాంశాలతో సినిమాలను తెరకెక్కించారు. రాజమౌళి ఈ సినిమా సక్సెస్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చరణ్, తారక్ సైతం ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు దక్కుతుందని నమ్మకంతో ఉన్నారు.

బాహుబలి సిరీస్ తో ప్రభాస్ కు, పుష్ప సినిమాతో బన్నీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ రాగా చరణ్, తారక్ లకు ఆర్ఆర్ఆర్ తో ఇతర భాషల్లో మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ మహేష్ హీరోగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus