టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ఏం చేసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుందనే సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ మధ్య కాలంలో తన సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు ఇతర విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే జక్కన్న ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలామంది భావిస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ కు ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి విదితమే..
టాలీవుడ్ సినిమాల స్థాయిని గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లిన (Rajamouli) రాజమౌళి రాబోయే రోజుల్లో తన సినిమాలతో మరింత ఎత్తుకు ఎదిగే అవకాశం అయితే ఉందని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. రాజమౌళి మాట్లాడుతూ మహేంద్ర సింగ్ ధోనికి నేను వీరాభిమానినని అన్నారు. ధోనీ సారథ్యంలో మన దేశ జట్టు టీ20, వన్డే వరల్డ్‌కప్ లు సాధించిందని ఆ సమయంలో నా ఆనందానికి అవధులు లేవని జక్కన్న చెప్పుకొచ్చారు.
ధోని ఎలాంటి ప్రాంతం నుంచి వచ్చాడో, ఎలా ఎదిగాడో, ఇతర క్రికెటర్లకు రోల్ మోడల్ గా ఏ విధంగా మారాడో అందరికీ తెలుసని రాజమౌళి కామెంట్లు చేశారు. మన జట్టులోకి అలాంటి ధోనీలు మరింత మంది రావాలని ఆయన పేర్కొన్నారు. కొవ్వూరులో ఉన్న సమయంలో క్రికెట్ బాగా ఆడేవాడినని నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టమని రాజమౌళి వెల్లడించారు. చెక్కతో చేయించిన బ్యాట్ వాడే వాళ్లమని ఆయన పేర్కొన్నారు.
మా కాలేజ్ టీం లో చాలామంది ప్రతిభావంతులు ఉన్నారని జక్కన్న చెప్పుకొచ్చారు. సదుపాయాల లేమి వల్ల వాళ్లలో చాలామంది క్రికెటర్లు కాలేకపోయారని రాజమౌళి కామెంట్లు చేయడం గమనార్హం. మహేష్ సినిమాతో జక్కన్న త్వరలో బిజీ కానున్నారు. సినిమా సినిమాకు రాజమౌళి క్రేజ్ అంచనాలను మించి పెరుగుతోంది.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!