Rajamouli, Balakrishna: రామ్‌చరణ్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ తొలుత విన్నది ఆయనే!

‘మగధీర’ అనగానే రామ్‌చరణ్‌ లుక్‌, హీరోయిజం… రాజమౌళి టేకింగ్‌, ఎలివేషన్లు, భారీతనం గుర్తొస్తాయి. అయితే రామ్‌చరణ్‌ ప్లేస్‌లో నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుకునేవాళ్లం తెలుసా? అవును అన్నీ అనుకున్నట్టుగా జరిగితే బాలయ్య… కాలభైరవగా కనిపించేవాడు. ఈ మాట ఎవరో చెప్పింది కాదు… రాజమౌళినే చెప్పారు. ‘మగధీర’ సినిమా కథను తొలుత విన్నది బాలయ్యేనట. ఈ విషయం గురించి మనకి పూర్తి వివరాలు చెప్పకపోయినా… హింట్‌ ఇచ్చి వదిలేశారు.

‘ఆహా’లో బాలయ్య హోస్ట్‌గా ప్రసారమవుతునర్న ‘అన్‌స్టాపబుల్‌’ షోకి దర్శక ధీరుడు రాజమౌళి, మరకతమణి కీరవాణి వచ్చారు. ఈ సందర్భంగా సినిమాలు, ఇతర విషయాలు గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాలయ్యను తొలిసారి రాజమౌళి ఎప్పుడు కలిశారు అనే విషయంలో చర్చ వచ్చింది. అప్పుడే ‘మగధీర’ కథ విషయం బయటకు వచ్చింది. ‘ఛత్రపతి’ సినిమా తర్వాత బాలయ్యను రాజమౌళి కలిశారట. అప్పుడు ‘మగధీర’ సినిమా కథను బాలయ్యకు చెప్పారట. అయితే ఏమైందేమో తెలియదు కానీ… ఆ సినిమా వర్కవుట్‌ కాలేదు.

ఎందుకు కాలేదనే విషయం తెలియదు కానీ… ఆ తర్వాత కొన్ని రోజులకు రామ్‌చరణ్‌కు ఆ సినిమా కథ చెప్పడం, సినిమా తీయడం జరిగిపోయాయి. ఆ తర్వాత ఆ సినిమ ఎంత విజయం సాధించిందో మనకు తెలిసిందే. అయితే ఆ సినిమాను అప్పుడు బాలకృష్ణ ఎందుకు ‘మగధీర’ను ఎందుకు ఓకే చెయ్యలేదు అనేది తెలియడం లేదు. ఒకవేళ చేసి ఉంటే… ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. అదిరిపోయేదేమో కదా. ‘మగధీర’లో రామ్‌చరణ్‌, కాజల్‌ జంటగా నటించిన విషయం తెలిసిందే. శ్రీహరి కీలక పాత్రలో నటించారు.

రామ్‌చరణ్‌ కెరీర్‌లో రెండో సినిమాగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర రికార్డులు తిరగరాసింది. పూర్వజన్మల నేపథ్యంలో సాగే ఈ సినిమా వసూళ్ల విషయంలోనూ అదే స్థాయిలో దూసుకుపోయింది. ₹35 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ₹150 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ రోజుల్లో పాన్‌ ఇండియా అనే కాన్సెప్ట్‌ వచ్చి ఉంటే… ఇంకా అదిరిపోయేదేమో.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus