Rajamouli: మహేష్ బాబు అభిమానులకు ఇది గూజ్ బంప్స్ తెప్పించే అప్డేటే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు,(Mahesh Babu)  దర్శకధీరుడు రాజమౌళి   (S. S. Rajamouli)  కలయికలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రాజమౌళి.. తన సినిమాల ద్వారా హీరోలను స్టార్లను చేశాడు. కానీ మొదటిసారి మహేష్ బాబు వంటి ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడు. అందువల్ల ఈ ప్రాజెక్టు రాజమౌళికి చాలా ప్రత్యేకం. ఆల్రెడీ సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న మహేష్ బాబుని రాజమౌళి ఏ రేంజ్లో ఎలివేట్ చేస్తాడు అనేది అందరిలోనూ ఆసక్తిని పెంచే అంశం.

ఇదిలా ఉండగా.. రాజమౌళి ఏ సినిమా మొదలుపెట్టినా.. దాని గురించి ఓ ప్రెస్ మీట్ పెట్టి… తాను చేయబోయే సినిమా కాన్సెప్ట్, బడ్జెట్, నటీనటుల వివరాలు రివీల్ చేస్తూ ఉంటాడు. మహేష్ బాబు సినిమా విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించబోతున్నాడు. కాకపోతే.. దానికంటే ముందే మహేష్ బాబు అభిమానులకి ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడట. విషయం ఏంటంటే.. మహేష్ బాబు కెరీర్లో 29 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఓ కాన్సెప్ట్ వీడియోని డిజైన్ చేస్తున్నాడట రాజమౌళి.

ఇందులో కథ పై, అలాగే హీరో పాత్ర పై అవగాహన వచ్చేలా విజువల్స్ ఉంటాయట. నెల రోజులుగా ఈ కాన్సెప్ట్ వీడియో పనిపైనే రాజమౌళి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇది నిజంగా మహేష్ బాబు అభిమానులకి గూజ్ బంప్స్ తెప్పించే న్యూస్ అనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి మహేష్ తప్ప.. మిగిలిన నటీనటులు ఫైనల్ అయినట్టు కన్ఫర్మ్ చేయలేదు రాజమౌళి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus