మరో పది రోజుల్లో ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఎత్తర జెండా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండు యూట్యూబ్ ఛానెళ్లలో ఈ సాంగ్ రిలీజ్ కాగా ఈ సాంగ్ కు ఏకంగా 6 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. సినిమాలో క్లైమాక్స్ తర్వాత రావాల్సిన ఈ సాంగ్ ను జక్కన్న పది రోజుల ముందే రిలీజ్ చేయడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ పై అంచనాలను మరింత పెంచే ఉద్దేశంతో జక్కన్న ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు.
అయితే ఈ సాంగ్ రిలీజ్ కావడం ద్వారా ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ గురించి కూడా రాజమౌళి పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు. ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ విషాదాంతం అని ఎన్టీఆర్ పాత్ర చనిపోతుందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. వైరల్ అయిన వార్తలను అభిమానులు సైతం నిజమేనని నమ్మారు. అయితే ఎత్తర జెండా పాటను చూస్తే బ్రిటిష్ వాళ్లపై పోరాటం చేసి సక్సెస్ సాధించినందుకు పాడుకున్న పాటలా ఉంది. ఈ పాటలో చరణ్, ఎన్టీఆర్ కనిపించడంతో పాటు అలియా భట్ కూడా ఉండటంతో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ లో ఏ హీరో పాత్ర చనిపోదని క్లారిటీ వచ్చేసింది.
మరోవైపు ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షోలకు ఏపీ సర్కార్ నుంచి అనుమతి లభించిందని ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్ రేటుకు అదనంగా 100 రూపాయల వరకు టికెట్ రేట్లను పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని సమాచారం అందుతోంది. అయితే ఈ సమాచారానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. మంత్రి పేర్ని నాని మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాకు అదనపు బెనిఫిట్స్ ఇచ్చామని వెల్లడించలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయానికి అనుకూల పరిస్థితులు ఏర్పడటం గమనార్హం.
సినిమాను వాయిదా వేయడమే ఆర్ఆర్ఆర్ కు అన్ని విధాలుగా ప్లస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!