Rajamouli, Mahesh: రెండు భాగాలుగా మహేష్ – రాజమౌళి సినిమా?

హాలీవుడ్ సినిమాలే ఎక్కువగా పార్ట్ 1 , పార్ట్ 2 అంటూ రూపొందుతాయి. ఈ ఫార్ములా టాలీవుడ్లో ఊపందుకుంది. మొదట రాంగోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ ‘రక్త్ర చరిత్ర 2 ‘ అంటూ తీశాడు కానీ సక్సెస్ కాలేదు. అయితే రాజమౌళి మాత్రం ఈ విషయంలో సక్సెస్ సాధించాడు. బాహుబ‌లితో ఆ ప్రమేయాగం చేసి డబుల్, ట్రిపుల్ ప్రాఫిట్స్ ను అందుకున్నాడు. తర్వాత ఇదే బాటలో ‘పుష్ప’ కూడా వచ్చింది.

ఇంకా చాలా సినిమాలు పార్ట్ 1 , పార్ట్ 2 అంటూ రూపొందాయి. అయితే మళ్ళీ (Rajamouli) రాజ‌మౌళి ఒకే కథతో పార్ట్ 1, పార్ట్ 2 అంటూ సినిమాలు చేయబోతున్నట్లు వినికిడి. మ‌హేష్‌తో రాజమౌళి ఓ సినిమా చేయాలి.ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు ప‌నులు మొదలయ్యాయి. కథ ఇది అని రాజమౌళి ఇంకా అనౌన్స్ చేసింది లేదు. కాకపోతే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో సాగే అడ్వెంచర్ డ్రామా అని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెలిపాడు.

ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తీస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో రాజమౌళి ఉన్నాడట. ఈ విషయం పై మ‌హేష్‌తో రాజ‌మౌళి చర్చలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ విషయంలో మహేష్ చాలా క్లారిటీగా ఉంటాడు.అది పక్కాగా వర్కౌట్ అయితే ఓకే, లేదంటే మహేష్ ముందడుగు వేయడు. కానీ రాజ‌మౌళితో సినిమా కాబట్టి.. అతను చెప్పిందే మహేష్ ఎక్కువగా ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడట. ఇప్పట్లో అయితే ఈ ప్రాజెక్టు ఇంకా మొదలు కాదు.. కానీ మొదలయ్యే వరకు రాజమౌళి చేసే మార్పులు చాలా ఉంటాయి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus