Rajamouli, Koratala Siva: కొరటాల జాగ్రత్త పడక తప్పదా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రతి హీరోను తన సినిమాలో అద్భుతంగా చూపిస్తారనే సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలో చిన్న పాత్రలో నటించినా తమకు మంచి గుర్తింపు వస్తుందని చాలామంది నటీనటులు భావిస్తారు. అయితే ఈ దర్శకుడి సినిమాలో నటించిన హీరోల తరువాత సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. చాలామంది దర్శకులు రాజమౌళి డైరెక్షన్ లో నటించి హిట్ కొట్టిన హీరోలతో సినిమాలు తెరకెక్కించి ఫెయిల్యూర్ ను చవిచూశారు. అయితే రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న చరణ్, తారక్ లతో హిట్ సాధించాల్సిన బాధ్యత కొరటాల శివపై పడింది.

ఆర్ఆర్ఆర్ కంటే కొన్ని నెలల ముందుగానే ఆచార్య రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా ఆర్ఆర్ఆర్ తర్వాత రిలీజ్ కానుంది. ఈ సినిమాతో చరణ్ తో హిట్ సాధించి కొరటాల శివ రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేయాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. యూనివర్సల్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాకు సంబంధించిన ఇతర విషయాలు తెలియాల్సి ఉంది.

ఆగష్టు సెకండ్ వీక్ నాటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కానుండటంతో ఎన్టీఆర్ కొరటాల శివ మూవీకి సంబంధించిన ఇతర విషయాల గురించి స్పష్టత రావాల్సి ఉంది. తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. తారక్ తో కూడా హిట్ సాధించాల్సిన బాధ్యత కొరటాలపై ఉంది. కొరటాల శివ అన్ని జాగ్రత్తలు తీసుకుని చరణ్, తారక్ లతో హిట్స్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus