‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని మొదట 2020 జూలై 30నే విడుదల చెయ్యాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేసాడు. అయితే అది వర్కౌట్ అవ్వలేదు. ఎన్టీఆర్ సరసన చెయ్యాల్సిన హీరోయిన్ ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకోవడం.. అలాగే హీరోలు ఎన్టీఆర్, చరణ్ లకు కూడా గాయాలు అవ్వడంతో చాలా రోజులు షూటింగ్ వాయిదా పడింది. అన్నీ సెట్ అయిన తరువాత ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని 2020 జనవరి 8న విడుదల చెయ్యబోతున్నట్టు కూడా దర్శక నిర్మాతలు అనౌన్స్ చేసారు.
అయితే ఈసారి వైరస్ మహమ్మారి వల్ల దెబ్బ పడింది. షూటింగ్ 4 నెలలు పైనే వాయిదా పడింది. ఇప్పుడు విదేశాలకు వెళ్లి షూటింగ్ చేసే పరిస్థితి లేదు, కనీసం పక్క రాష్ట్రాలకు వెళ్లే స్కోప్ కూడా లేదు. కాబట్టి మరింత ఆలస్యం అవుతుందని ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ బాద పడ్డారు. అయితే ఓ రకంగా ఆలస్యం అవ్వడమే మంచిదని కొందరు నిర్మాతలు అలాగే డిస్ట్రిబ్యూటర్లు .. తమ అభిప్రాయాన్ని రాజమౌళికి వ్యక్తం చేశారట. ‘ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడానికి టైం పడుతుంది.
ఆగష్ట్ లో థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉందంటున్నారు. ఒక వేళ తెరుచుకున్నప్పటికీ.. చిన్న సినిమాలకు, మీడియం బడ్జెట్ సినిమాలకు వర్కౌట్ అవుతుంది కానీ పెద్ద సినిమాలకు వర్కౌట్ అవ్వదు. పైగా ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి పాన్ ఇండియా సినిమాకి అస్సలు వర్కౌట్ అవ్వదు. అన్ని రాష్ట్రాల్లోనూ.. అలాగే విదేశాల్లోనూ కూడా పరిస్థితి పూర్తిగా సెట్ అయిన తర్వాతే ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలైతే బాగుంటుంది’ అంటూ రాజమౌళి తో వారు చెప్పారని తెలుస్తుంది.
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?