మహేష్, రాజమౌళి కాంబో.. ప్లాన్ సెట్టయ్యింది!

మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా రానున్నట్లు లాక్ డౌన్ లోనే ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటి సారి కలుస్తున్న ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. రాజమౌళి కూడా వీలైనంత వరకు ఈ సినిమాను చాలా స్పీడ్ గా సెట్స్ పైకి తేవాలని అనుకున్నాడు. కానీ లాక్ డౌన్ కారణంగా ప్లాన్స్ అన్ని తారుమారు అయ్యాయి.

అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన ఒక ప్లాన్ సెట్టయినట్లు టాక్ వస్తోంది. దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేసిన తరువాత డిసెంబర్ నెలలోనే మహేష్ సినిమాను స్టార్ట్ చేయాలని జక్కన్న ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా డిసెంబర్ లోగా పూర్తవుతుంది.

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానునట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ఇక ఆ సమయంలోనే మహేష్ రాజమౌళి కొత్త సినిమాతో బిజీ కానున్నాడు. ఇక సినిమాను కరెక్ట్ గా 2022 చివరలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. కానీ దర్శకుడు రాజమౌళి అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తాడనేది నమ్మడానికి వీలులేదు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus