ఇప్పుడు సినిమాలకు సంబంధించి పోస్టర్లు అంటే కలెక్షన్ల పోస్టర్లే. మా సినిమా ఇంత వసూళ్లు సాధించింది అని వస్తాయి. అందులో నిజానిజాలు ఎంత అనేది ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే అవి నిజం కావు అని, కేవలం అభిమానుల కోసమే అని ఓ నిర్మాత చెబితే. పోస్టర్లు చూసి నవ్వుతున్నారు అని ఓ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అన్నారు. నిజానికి మనకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి. అయితే ఈ పోస్టర్లకు ఆద్యం మరో పోస్టర్లు ఉన్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పోస్టర్ల వార్ ఇప్పటిది కాదు. ఒకప్పుడు ‘మా సినిమా ఇన్ని థియేటర్లలో ఇన్ని రోజులు ఆడింది’ అంటూ పోస్టర్లు వేశారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే సినిమాలోకి స్క్రీన్స్ లేని రోజులవి. ఇప్పుడు లాగే అప్పుడు కూడా ఈ పోస్టర్ల విషయంలో డౌట్స్ ఉండేవి. ఆ థియేటర్‌లో సినిమా ఆడకపోతున్నా థియేటర్ల లిస్ట్‌లో ఆ పేరు ఉండేది. దీంతో పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్స్ జరిగేవి. తర్వాతర్వాత పోస్టర్లు ఆగిపోవడంతో ఓ సమస్య తగ్గింది.
ఈ ఫేక్ పోస్టర్లు ఎవరు సృష్టించారు అనేది పక్కాగా చెప్పలేం కానీ.. పోస్టర్ల కారణంగా ఓ దర్శకుడు హర్ట్ అయి సినిమా ప్రచారానికి కాస్త దూరంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం చూస్తే.. దీని వెనుక కారణం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) . ‘మగధీర’ (Magadheera)సినిమా సమయంలో రాజమౌళి (S. S. Rajamouli) – అల్లు అరవింద్ మధ్య జరిగిన ఓ చర్చ వింటే మీకే అర్థమవుతుంది. ‘మగధీర’ సినిమా చిత్రీకరణ సమయంలో ఓసారి అల్లు అరవింద్ – రాజమౌళి మధ్య చర్చ జరిగిందట.
థియేటర్ల లిస్ట్ అంటే ఫేక్ పోస్టర్లు వేస్తున్నారని, ఇది సరికాదని, మనం ఇలాంటి పనులు చేయొద్దు అని ఇద్దరూ అనుకున్నారట. కట్ చేస్తే ‘మగధీర’ సినిమా విజయం సాధించాక పోస్టర్లలో థియేటర్ల లిస్ట్‌లో ఎక్కువ రాశారట. దీంతో అరవింద్‌ను రాజమౌళి (Rajamouli) అడిగారట. ఆ తర్వాత ప్రచారం విషయంలో మళ్లీ ముందుకు రాలేదు. అంటే ఫేక్ పోస్టర్ల అంశంలో అల్లు అరవింద్ హస్తం పెద్దగానే ఉందన్నమాట. సినిమా విజయం, వసూళ్ల విషయంలో హిట్ అయినా.. ఈ పోస్టర్ల విషయంలో సినిమా టీమ్ రాజమౌళిని ఆ రోజుల్లో ఇబ్బంది పెట్టింది.