Rajamouli, Mahesh Babu: మహేష్ విషయంలో రూటు మార్చిన జక్కన్న..?

టాలీవుడ్ ప్రేక్షకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్న మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ నుంచి మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రతి సినిమా రిలీజైన తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకునే రాజమౌళి ఎక్కువగా గ్యాప్ తీసుకోకుండానే మహేష్ మూవీని మొదలుపెడతారని సమాచారం.

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ పీరియాడిక్ ఫిల్మ్ కాగా మహేష్ విషయంలో మాత్రం జక్కన్న రూటు మార్చారని తెలుస్తోంది. మహేష్ తో రాజమౌళి సామాజిక అంశాలతో కూడిన కమర్షియల్ ఫిల్మ్ ను తెరకెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ తో జానపదం , తారక్ చరణ్ తో పీరియాడిక్ ఫిల్మ్ తీసిన జక్కన్న మహేష్ తో మాత్రం రొటీన్ జానర్ లోనే సినిమా తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వస్తుండటం గమనార్హం.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ పూర్తైన వెంటనే మహేష్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నారు. రాజమౌళి మహేష్ మూవీని రొటీన్ జానర్ లో తెరకెక్కించనున్నారని వస్తున్న వార్తల పట్ల మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి మహేష్ కు అన్యాయం చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అయితే మహేష్ రాజమౌళి మూవీ గురించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus