యంగ్ రెబల్ స్టార్ పుట్టిన రోజున భారీ విందు ఇవ్వనున్న దర్శకధీరుడు!

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన సినీ కెరీర్లో ఎన్నో మైలు రాళ్లు అధిగమించారు. అనేక రికార్డులను కొల్లగొట్టారు. వివిధ రాష్ట్ర, జాతీయ అవార్డులను అందుకున్నారు. బాహుబలితో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. అయినా ఎప్పుడూ పార్టీ మాట ఎరుగరు. తొలి సారి ఆయన గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారు.

బాహుబలి చిత్రం అద్భుతంగా రావడం కోసం తనలాగే నిబద్ధతతో, క్రమశిక్షణతో నాలుగేళ్లపాటు కష్టపడిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం ఈ విందు ఇస్తున్నారు. డార్లింగ్ పుట్టిన రోజైన అక్టోబర్ 23 న ఈ పార్టీ ప్లాన్ చేశారు. ఈ వేడుకకు తెలుగు పరిశ్రమలోని అందరినీ పిలవనున్నారు. ప్రస్తుతం రాజమౌళి ప్రభాస్, అనుష్కలపై పాట చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

అందువల్ల ఈ పార్టీ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందానికి ఆయన సతీమణి రమ నేతృత్వం వహిస్తున్నారు. ప్రతి కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించే జక్కన్న ఈ విందు గురించి కూడా నలుగురు గొప్పగా చెప్పుకునేలా చేస్తాననడంలో డౌటే లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus