Rajamouli, Prashanth Neel: మరో స్టార్ డైరెక్టర్ ఈ రికార్డును అందుకోలేరా?

ఒక సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందంటే ఆ సినిమా సక్సెస్ వెనుక దర్శకుని కృషి ఎంతో ఉంటుంది. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లకు దర్శకులుగా ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కిందంటే ఆ విజయాల వెనుక వాళ్ల కష్టం ఎంతో ఉంది. అనిల్ రావిపూడి మరి కొందరు డైరెక్టర్లు సైతం వరుస విజయాలను అందుకుంటున్నా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించే సినిమాలను తీయడం ద్వారా ఈ ఇద్దరు డైరెక్టర్లు వార్తల్లో నిలుస్తున్నారు.

రాజమౌళి తన సినిమాలలో ఎమోషన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే ప్రశాంత్ నీల్ యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. రాజమౌళి సినిమాలలో హీరోలు ఒకింత సాఫ్ట్ నేచర్ ను కలిగి ఉంటే ప్రశాంత్ నీల్ మాత్రం సినిమా తొలి సన్నివేశం నుంచి హీరోలను వైల్డ్ గా చూపిస్తారు. ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు సక్సెస్ కావడానికి ఈ డైరెక్టర్లతో పని చేస్తున్న టీమ్ కూడా ఒక విధంగా కారణమని చెప్పవచ్చు.

అయితే రాబోయే రోజుల్లో ఈ జాబితాలో సౌత్ నుండి మరో స్టార్ డైరెక్టర్ చేరతారా? అనే ప్రశ్నకు ఇప్పట్లో కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి, ప్రశాంత్ నీల్ సినిమాలే ప్రపంచంగా బ్రతుకుతున్నారని అందువల్లే వాళ్ల సినిమాలు అంచనాలను మించి విజయాలను సొంతం చేసుకుంటున్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ఇద్దరు డైరెక్టర్ల విజన్ అద్భుతమని ఫ్యాన్స్ భావిస్తారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీ అవుతుండగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు.

ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్లతో తెరకెక్కుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఘన విజయాలను సాధించి టాలీవుడ్ ఖ్యాతిని మరింత పెంచాలని ఈ ఇద్దరు డైరెక్టర్ల అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. సలార్ సినిమా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా మహేష్ మూవీ 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus