Rajamouli, Prashanth Neel: రాజమౌళి vs నీల్.. డామినేట్ చేసేదెవరు?

ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసే దర్శకుల లిస్ట్‌లో రాజమౌళి (S. S. Rajamouli), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) టాప్ ప్లేస్‌లో ఉన్నారు. వీరి సినిమాలు భారీగా వసూళ్లు రాబట్టేలా ఉంటాయి. అయితే, నెక్స్ట్ వీరి మేకింగ్ స్టైల్, మార్కెట్ పద్ధతి ఎలా ఉంది? ఎవరు టాప్ పొజిషన్‌ను అందుకోవచ్చు? అనే చర్చ ఆసక్తికరంగా మారింది. రాజమౌళి మెగా బడ్జెట్ ప్రాజెక్ట్స్‌తో భారీగా ప్లాన్ చేస్తారు. బాహుబలి (Baahubali) నుంచి RRR వరకు ఆయన సినిమాలు హాలీవుడ్ స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దారు.

Rajamouli, Prashanth Neel

ప్రస్తుతం మహేష్ బాబుతో (Mahesh Babu) చేస్తున్న సినిమా అంతర్జాతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది. బడ్జెట్ రూ.1000 కోట్లు, ఇక బిజినెస్ అంచనా రూ.3000 కోట్ల వరకు ఉండొచ్చని టాక్. అయితే, రాజమౌళి సినిమాల‌కు ఎక్కువ సమయం పడుతుంది. ఆయన సినిమా కోసం ప్రేక్షకులు 3-4 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. అయితే ప్రశాంత్ నీల్, తక్కువ టైమ్‌లో ఎక్కువ సినిమాలు కంప్లీట్ చేసే ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు.

కేజీఎఫ్ 2 (KGF 2) తో నేషనల్ లెవెల్‌లో క్రేజ్ సంపాదించిన ఆయన, ఇప్పుడు సలార్ 2, డ్రాగన్, కేజీఎఫ్ 3 లాంటి బిగ్ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. ఆయన స్ట్రాటజీ ఏమిటంటే, 3-4 ఏళ్లలో కనీసం 3 సినిమాలు చేయడం. అంటే, ఒక సినిమాతో 1000 కోట్లు కలెక్షన్ వస్తే, మొత్తం మూడు సినిమాలుగా 4000 కోట్ల రెవెన్యూ జనరేట్ చేయగలరు.

మొత్తానికి, రాజమౌళి లాంగ్ టర్మ్‌లో ఇండస్ట్రీకి ఒకో క్లాసిక్ అందిస్తారు. కానీ, ప్రశాంత్ నీల్ మాత్రం స్పీడ్‌గా సినిమాలు కంప్లీట్ చేస్తూ బాక్సాఫీస్ హవా కొనసాగించగలరు. ఒకే సినిమాలో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయాలంటే రాజమౌళి నెంబర్ వన్. కానీ, మార్కెట్ వ్యూహంలో ప్రశాంత్ నీల్ స్పీడ్ గేమ్‌తో టాప్ ప్లేస్‌లో ఉండే ఛాన్స్ ఎక్కువ. మరి, రానున్న రోజుల్లో ఎవరు నెంబర్ వన్ డైరెక్టర్‌గా నిలుస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus