RRR Movie: జక్కన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా..?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో హీరోగా నటిస్తే ఆ హీరోకు క్రేజ్, మార్కెట్ పెరగడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీస్థాయిలో పెరుగుతుంది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ గత మూడేళ్లుగా ఈ సినిమా మినహా మరో సినిమాలో నటించలేదు. 2019, 2020 సంవత్సరాలలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదనే సంగతి తెలిసిందే. రాజమౌళి ప్రతి సినిమాను ప్లానింగ్ ప్రకారం తెరకెక్కించినా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల రాజమౌళి అనుకున్న ప్రకారం ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరగలేదు.

తాజాగా ఆర్ఆర్ఆర్ చివరి షెడ్యూల్ మొదలు కాగా 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని ఈ షెడ్యూల్ తో షూటింగ్ కు సంబంధించిన పనులు పూర్తవుతాయని సమాచారం. ఆగష్టు మొదటి వారంలోపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసి పంపిస్తానని రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కు మాటిచ్చారని తెలుస్తోంది. రాజమౌళి ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీనే సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారని అయితే కరోనా థర్డ్ వేవ్ వస్తే మాత్రం సినిమా రిలీజ్ డేట్ విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

జక్కన్న తారక్ కు ఇచ్చిన మాట ప్రకారం షూటింగ్ ను పూర్తి చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాను వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ అనుకున్న విధంగా ఆర్ఆర్ఆర్, కొరటాల శివ సినిమాల షూటింగ్ జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus