దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ హీరో సినిమా చేస్తే అది బ్లాక్ బస్టర్ అవుతుంది.ఆ హీరో ఇమేజ్ ను మరింత పెంచుతుంది. అందులో డౌటే లేదు. కానీ ఆ తర్వాత ఆ హీరో చేసే సినిమా మాత్రం కచ్చితంగా ప్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ ఎప్పటి నుండో ఉంది. కానీ చిరు మాత్రం దీనిని నమ్మను అని మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు.
చరణ్ ‘మగధీర’ తర్వాత ‘ఆరెంజ్’ అనే సినిమా చేసినా.. అది డిజాస్టర్ అయినప్పటికీ చిరు ఇలా చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ చేసిన చరణ్ తర్వాత ‘ఆచార్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం ఖాయం అని చిరు చెప్పుకొచ్చారు. ‘రాజమౌళి గారు సినిమాలు చేసిన హీరోలకి… అంత పెద్ద హిట్లు అయిపోయిన తర్వాత.. ఆ హీరో నెక్స్ట్ సినిమా చూడండి అన్నీ ప్లాపులే అని చాలా మందికి ఉంది.
కానీ అది వాస్తవం కాదు. ఒకవేళ కంటెంట్ లో ఏమైనా మిస్ ఫైర్ అయ్యి అలా అయ్యుండొచ్చు, నేను అలాంటి వాటిని నమ్మను. బట్ అలా అనుకునే వాళ్ళకి చెబుతున్నాను.. ఆ యొక్క మిత్ ను ఇది(ఆచార్య) రూపుమాపి.. ఆ హిట్టు తర్వాత ఇది ఇంకో హిట్టు అవుతుంది. ఇది కచ్చితం మీరు చూస్తారు.. జరుగుతుంది. 29 ఏప్రిల్ నాడు మనమందరం కూడా దీన్ని ఆస్వాదిద్దాం.. ఎంజాయ్ చేద్దాం’ అంటూ ధీమా వ్యక్తం చేశారు.
కానీ కట్ చేస్తే ఈరోజు(ఏప్రిల్ 29నే) విడుదలైన ‘ఆచార్య’ మూవీ డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. చిరు… కొరటాల శివ అపజయమెరుగని దర్శకుడు కాబట్టి.. ఆయన పై నమ్మకంతో రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుంది అని అన్నారో ఏమో తెలీదు కానీ సినిమా మాత్రం అభిమానుల్ని సైతం తీవ్రంగా నిరాశపరిచింది అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
#Acharya #AcharyaOnApr29 #AcharyaReview #AcharyaPreReleaseEvent pic.twitter.com/UgM6W4DN8Y
— Phani Kumar (@phanikumar2809) April 29, 2022
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!