Rajamouli, Jr NTR: ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ పై జక్కన్న షాకింగ్ కామెంట్స్!

  • April 13, 2022 / 07:28 PM IST

ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఈ సినిమా కలెక్షన్లపరంగా రికార్డులను సృష్టిస్తోంది. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా క్లైమాక్స్ లో జక్కన్న తారక్ కు కొంతమేర ప్రాధాన్యత తగ్గించడంపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. తారక్ ను జక్కన్న మోసం చేశారంటూ కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తాజాగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Click Here To Watch Trailer

జూనియర్ ఎన్టీఆర్ గొప్ప నటుడనే విషయం అందరికీ తెలుసని రాజమౌళి అన్నారు. రామ్ చరణ్ మంచి నటుడనే విషయం అందరికీ తెలిసినా ఇంత బాగా చరణ్ నటిస్తాడని ఎవ్వరూ అనుకోలేదని ఆయన వెల్లడించారు. సినిమాలో చరణ్ నటన ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుండటం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన వెల్లడించారు. నా డైరెక్షన్ లో చరణ్ అలా నటించడం మరింత సంతోషాన్ని కలిగిస్తోందని రాజమౌళి వెల్లడించారు.

ఆర్ఆర్ఆర్ లో ఒకరు ఎక్కువని మరొకరు తక్కువని తాను నమ్మనని క్లైమాక్స్ లో చరణ్ ఎక్కువగా కనిపించాడని అందరూ అనుకుంటున్నారని మూవీని కొమురం భీముడో సాంగ్ దగ్గర ఆపేసి ఉంటే క్రెడిట్ ఎన్టీఆర్ కు వెళుతుందని రాజమౌళి అన్నారు. క్లైమాక్స్ చూసి బయటకు వస్తాం కాబట్టి చరణ్ గురించి అలా అనిపించి ఉండవచ్చని రాజమౌళి అన్నారు. కొమురం భీముడో సాంగ్ లో తారక్ అద్బుతంగా నటించాడని అతనిలా మరే నటుడు ఇండియాలో నటించలేడేమోనని జక్కన్న వెల్లడించారు.

జూనియర్ ఎన్టీఆర్ ఒకే షాట్ లో మాతృభూమిపై ప్రేమతో పాటు బాధ, నొప్పి చూపించారని రాజమౌళి చెప్పుకొచ్చారు. రాజమౌళి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus