Rajamouli, Mahesh Babu: మహేష్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి!

మహేష్ జక్కన్న కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ సినిమా గురించి మాట్లాడిన రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమా నా కెరీర్ లోనే పెద్ద సినిమా అని ఆయన అన్నారు. హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడిన జక్కన్న ఈ కామెంట్లు చేశారు.

హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమాను ప్రదర్శించగా అక్కడ ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. సినిమా పూర్తైన తర్వాత ప్రేక్షకులు స్టాండింగ్ ఒవియేషన్ ఇచ్చారంటే ఈ సినిమా వారిని ఏ స్థాయిలో ఆకట్టుకుందో సులువుగానే అర్థమవుతుంది. ఆ తర్వాత జక్కన్న స్టేజ్ పైకి వచ్చి మహేష్ తో తెరకెక్కించే సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా కామెంట్లు చేశారు. మహేష్ తో ఇప్పటివరకు నేను చేయని తరహా సినిమాను చేయబోతున్నానని రాజమౌళి కామెంట్లు చేశారు.

ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథతో ఈ సినిమా తెరకెక్కనుందని జక్కన్న తెలిపారు. ఇప్పటికే మహేష్ తో తెరకెక్కించే సినిమా ఇండియాలో ట్రెండ్ అవుతుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. నేను అమెరికాలోని ఫిల్మ్ ఫెస్టివల్ కు వచ్చానని అనుకున్నానని కానీ ఫిల్మ్ ఫెస్టివల్ కు వచ్చిన ప్రేక్షకులను చూస్తుంటే అమెరికా అమీర్ పేట్ లా కనిపిస్తుందని అన్నారు.

వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుండగా 600 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజమౌళి మహేష్ కాంబో మూవీ 2025లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లోని లొకేషన్లలో జక్కన్న ఈ సినిమాను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు కూడా రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి తెగ ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus