Rajamouli: ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జక్కన్న!

తెలుగు రాష్ట్రాల్లో రాధేశ్యామ్ సినిమా దాదాపుగా 900 స్క్రీన్లలో రిలీజైంది. రాధేశ్యామ్ సినిమా అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో కొందరు అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా జక్కన్న ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి ప్రభాస్ నన్ను చెడగొట్టాడంటూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ బాహుబాలి తర్వాత తనతో లవ్ స్టోరీ చేయడం సులువు కాదని అయితే రాధాకృష్ణ కుమార్ మాత్రం తనతో లవ్ స్టోరీ చేశాడని అన్నారు.

Click Here To Watch Now

వర్షం సినిమాను రాజమౌళి చూసి అమ్మాయి వెనుక అబ్బాయి పడటం నేను రాయలేనని తీయలేనని చూడలేనని అన్నాడని అయితే మగధీర సినిమాలో 400 సంవత్సరాల తర్వాత కూడా అబ్బాయి అమ్మాయి వెంటపడటం చూపించారని ప్రభాస్ అన్నారు. అంత మార్పు ఎలా వచ్చింది అని ప్రభాస్ రాజమౌళిని అడగగా “నువ్వే చెడగొట్టావ్ నన్ను” అంటూ రాజమౌళి ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. రాజమౌళి అలా చెప్పడంతో ప్రభాస్ పకపకా నవ్వేశారు.

రాజమౌళి రాధేశ్యామ్ గురించి మాట్లాడుతూ సినిమాలో సంచారి సాంగ్ తో పాటు ఆ సాంగ్ లో ప్రభాస్ నవ్వు నచ్ఛిందని చెప్పుకొచ్చారు. జక్కన్న కామెంట్లకు ప్రభాస్ స్పందిస్తూ రాజామౌళికి నచ్చితే అందరికీ నచ్చుతుందని తెలిపారు. ఆ తర్వాత ప్రభాస్ మాట్లాడుతూ రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలకు ఏదో కనెక్షన్ ఉందని అందువల్లే రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో రాజమౌళి పాల్గొంటున్నారని చెప్పుకొచ్చారు. 200 కోట్ల రూపాయల బిజినెస్ చేసిన రాధేశ్యామ్ ఆ స్థాయిలో కలెక్షన్లను సాధించడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో విడుదలైన రాధేశ్యామ్ సినిమా స్లోగా ఉందని ఎక్కువమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus