రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కావడానికి 9 రోజుల సమయం మాత్రమే ఉంది. ఎన్టీఆర్, చరణ్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో జక్కన్న మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను ఉక్రెయిన్ లో అద్భుతంగా చేశామని ఆన్నారు. అయితే ఉక్రెయిన్ లో ఇప్పుడు యుద్ధం వస్తుందని తాము అస్సలు ఊహించలేదని జక్కన్న కామెంట్లు చేశారు.
ఉక్రెయిన్ కల్చర్, ఫుడ్ బాగా నచ్చాయని జక్కన్న చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ గురించి ఇలాంటి వార్తను తాను వింటానని అస్సలు అనుకోలేదని జక్కన్న తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని జక్కన్న చెప్పుకొచ్చారు. సీఎం జగన్ ను కలిసిన తర్వాత తమకెంతో సంతృప్తి కలిగిందని జక్కన్న కామెంట్లు చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవిత చరిత్ర అంటూ వైరల్ అవుతున్న వార్తలను జక్కన్న ఖండించారు.
ఆర్ఆర్ఆర్ మూవీ ఫిక్షన్ మూవీ అని ఇది ఎవరి జీవిత చరిత్ర కాదని రాజమౌళి చెప్పుకొచ్చారు. బాహుబలి సిరీస్ సినిమాలతో పోల్చి చూస్తే ఆర్ఆర్ఆర్ పెద్దదని జక్కన్న తెలిపారు. తాము ఆర్ఆర్ఆర్ ప్రీమియర్లకు సిద్ధంగా ఉన్నామని రాజమౌళి తెలిపారు. తారక్ సూపర్ కంప్యూటర్ అని జక్కన్న పొగడగా తారక్ నటనా నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయానని చరణ్ వెల్లడించారు. తారక్ మాట్లాడుతూ ఉక్రెయిన్ ప్రజలకు, డ్యాన్సర్లకు కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన ఎక్కువని వాళ్లంతా ఫ్రెండ్లీ పర్సన్స్ అని చెప్పుకొచ్చారు.
‘నాటు నాటు’ సాంగ్ లో ఉక్రెయిన్ డ్యాన్సర్లు బాగా డ్యాన్స్ చేశారని తారక్ అన్నారు. ప్రమోషన్స్ ద్వారా ఆర్ఆర్ఆర్ యూనిట్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన తర్వాత 1,000 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను సాధిస్తుందేమో చూడాలి.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!