Rajamouli: బాలీవుడ్ మీడియా కోసం రాజమౌళి స్పెషల్ ప్లాన్!

దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రమోషన్స్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి అని మొదటినుంచే ఆలోచిస్తూ ఉంటాడు. సినిమాను మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయ్యే వరకు కూడా ప్రతి విషయంలో ఒక క్లారిటీ తో వర్క్ చేస్తూ ఉంటాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. సినిమాపై ఎప్పటికీ బజ్ అయితే తగ్గకుండా మధ్య మధ్యలో ఏదో ఒక అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాడు ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా అని బాహుబలి సినిమా తోనే చాలా క్లారిటీ గా అర్థమైంది.

Click Here To Watch Now

ప్రస్తుతం RRR పై కూడా అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు జనవరి 7వ తేదీన రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. మొత్తానికి మార్చి 25వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మరోసారి దర్శకుడు రాజమౌళి చాలా బలంగా సిద్ధమవుతున్నాడు. దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధం చేసి ఉంచారు.

అంతేకాకుండా దర్శకుడు రాజమౌళి బాలీవుడ్ మీడియా పై స్పెషల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్ సినిమాకు చాలా ఎక్కువ నెగిటివ్ టాక్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి రావడంతో కొంత ఆలోచనలో పడ్డారు.రాజమౌళి అక్కడ మీడియాను ఆకర్షించించే విధంగా వారికి దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకుముందే బాలీవుడ్ లో దాదాపు అన్ని ప్రధాన చానల్స్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది.

ఇక ఇప్పుడు ప్రమోషన్ విషయంలో కూడా వారిని కూడా భాగం చేయాలని హిందీ పిఆర్ఓ లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు సినిమాకు నెగిటివ్ టాక్ రాకుండా చేయాలి అని అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను హిందీలో పెన్ స్టూడియోస్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. వాళ్లకు బాలీవుడ్ మీడియా పై చాలా పట్టు ఉంది. ఇక వాళ్ళు కూడా రాజమౌళి ఆలోచనతో బాలీవుడ్ మీడియా సంస్థలను లైన్ లో పెడుతున్నట్లు సమాచారం.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus