రాజమౌళి ఏం చేసినా కొత్తగా ఉంటుంది. సినిమా చేసినా, రోడ్ ట్రిప్ వేసినా, ఫారిన్ ట్రిప్ వేసినా ఇతరుల్లా చేయరు అని అంటుంటారు. ఆఖరికి ఆయన ట్వీట్ వేసినా డిఫరెంట్‌గా రాసుకొస్తారు. తాజాగా ఆయన ఓ వీడియోను ట్వీట్ చేశారు. అందులో నా చిరకాల కోరిక తీరింది అంటూ రాసుకొచ్చారు. తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను రాజమౌళి ఇటీవల కుటుంబసమేతంగా సందర్శించారు. దీనికి సంబంధించిన వీడియోనే ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
‘‘రోడ్ ట్రిప్ చేస్తూ తమిళనాడులోని దేవాలయాలను సందర్శించాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఈ విషయంలో మా అమ్మాయికి ధన్యవాదాలు చెప్పాలి. ఆమె వల్లే ఇప్పుడు ఈ ట్రిప్, నా కోరిక సాధ్యమయ్యాయి. జూన్ చివరి వారమంతా శ్రీరంగం, బృహదీశ్వరాలయం, రామేశ్వరం, కనడుకదన్, తూత్తుకూడి, మధురై దేవాలయాలను సందర్శించాం’’ అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ తాజా ప్రయాణం తనకెంతో ఉత్సాహాన్నిచ్చిందని రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు. నేను సందర్శించిన దేవాలయాల్లోని శిల్పకళ చూసి ఆశ్చర్యపోయాను.
చోళుల కాలంలోనే ఎంతో గొప్ప ఇంజినీర్లు ఉన్నారు. వాళ్ల ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రతిభ మంత్రముగ్దులను చేస్తాయి అని అక్కడి శిల్ప కళా నైపుణ్యాన్ని రాజమౌళి తనదైన శైలిలో వివరించారు. కుంభకోణంలోని కాక హోటల్, రామేశ్వరంలోని మురుగదాసు హోటల్‌లో భోజనం రుచిగా ఉన్నాయి. ఈ ట్రిప్ వల్ల నేను వారంలోనే మూడు కేజీల బరువు పెరిగాను అని కూడా చెప్పారు జక్కన్న. ఇక జక్కన్న (Rajamouli) సినిమా విషయానికొస్తే.. మహేశ్ బాబుతో ఓ అడ్వెంచరస్ సినిమా ప్లాన్ చేశారు.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా సీక్వెల్ కూడా ఉండబోతోంది. అయితే ఆ సినిమాకు జక్కన్న కేవలం మార్గదర్శకులు మాత్రమే. ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ ఉండనే ఉంది. అయితే ఇది ఎప్పుడు అనేది చెప్పలేం. ఇవి కాకుండా రాజమౌళి ఓ హాలీవుడ్ యానిమేషన్ సినిమా రూపొందిస్తారని గతంలో ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. దాని సంగతి ఒకటి తేలాల్సి ఉంది.
Wanted to do a road trip in central Tamilnadu for a long time. Thanks to my daughter who wanted to visit temples, we embarked upon it. Had been to Srirangam, Darasuram, Brihadeeswarar koil, Rameshwaram, Kanadukathan, Thoothukudi and Madurai in the last week of June . Could only… pic.twitter.com/rW52uVJGk2