Rajamouli: సలార్ సినిమాకు మద్దతుగా నిలిచిన రాజమౌళి!

బాహుబలి సినిమా ద్వారా ఫాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ ఈ సినిమా తర్వాత వరుసగా మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూడు సినిమాలలో ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ప్రభాస్ కి సక్సెస్ అందించలేకపోయింది. ఈ క్రమంలోనే ఈయన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కే జి ఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని అందుకున్న తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నేను ప్రభాస్ హీరోగా అనే సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమాని హోం భలే ఫిలిమ్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రభాస్ తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తూ ప్రభాస్ సినిమాకు మద్దతుగా నిలిచారని తెలుస్తుంది. ఇలా ఈ సినిమా ప్రమోషన్లలో జక్కన్న కూడా ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేశారని తెలుస్తుంది.

ఇలా ప్రభాస్ సినిమాకు రాజమౌళి (Rajamouli) సాయం చేయడంతో సినిమాపై అంచనాలు కూడా పెరుగుతున్నాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా తర్వాత ఈయనకు అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం రాలేకపోయింది. ఈ సలార్ సినిమా పై ఇటు చిత్ర బృందంతోపాటు ప్రభాస్ అభిమానులు కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి డిసెంబర్ 22వ తేదీ రాబోయే ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus