Rajamouli: షార్ట్ ఫిలిం కూడా గ్రాండ్ గా తీస్తానంటున్న జక్కన్న..!

  • June 4, 2021 / 01:57 PM IST

సాధారణంగా డైరెక్టర్ కావాలనుకుంటున్న వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ తో ప్రూవ్ చేసుకున్న తర్వాత డైరెక్టర్ అవకాశాలను దక్కించుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న చాలా మంది యంగ్ డైరెక్టర్లు.. అలా వచ్చినవారే. అయితే ఒకసారి క్రేజ్ వచ్చిన తర్వాత షార్ట్ ఫిలిమ్స్ తీస్తారా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. కానీ గతంలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఓ షార్ట్ ఫిలిం తీశారు. ఇందులో అల్లు అర్జున్ నటించడం మరో విశేషం.

స్టార్ డైరెక్టర్ అయ్యాక కూడా సుకుమార్ ఇలా షార్ట్ ఫిలిం చేయడం ఓ వింతలా చూశారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు ఏకంగా దర్శకధీరుడు రాజమౌళి కూడా షార్ట్ ఫిలిం తీయడానికి రంగంలోకి దిగుతుండడం విశేషం. వివరాల్లోకి వెళితే.. క‌రోనా టైంలో ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్న పోలీసుల‌ పై రాజ‌మౌళి ఓ షార్ట్ ఫిల్మ్ తీయ‌డానికి రెడీ అయ్యాడట. 19 నిమిషాల రన్ టైం తో ఈ షార్ట్ ఫిలిం ఉంటుందని సమాచారం.

ఈ షార్ట్ ఫిలిం కోసం ఇటీవ‌ల రాజ‌మౌళి సైబ‌రాబాద్ పోలీస్ అధికారులైన సి.పి. స‌జ్జ‌నార్, హైద‌రాబాద్ సి.పి. అంజ‌నీ కుమార్, రాచ‌కొండ సి. పి. మ‌హేశ్ భ‌గ‌వ‌త్ ల‌ను కలిసి దీని పై డిస్కస్ చేసినట్టు సమాచారం. వారు కూడా ఈ షార్ట్ ఫిలిం రూపకల్పనకు ఓకే చెప్పడంతో రాజ‌మౌళి ముంద‌డుగు వేసినట్టు తెలుస్తుంది. ఇందులో బలమైన మెసేజ్ కూడా ఉంటుందని స్పష్టమవుతుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus