Rajamouli, Pawan Kalyan: భీమ్లా నాయక్ తో పోటీ వద్దట

RRR సినిమా విడుదల విషయంలో అందరూ సంతృప్తిగానే ఉన్నప్పటికీ చిత్ర నిర్మాతల్లో దర్శకుడిలో మాత్రం కొంత టెన్షన్ నెలకొంది. సినిమాను 2020 జనవరి 7న సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా సక్సెస్ కావాలి అంటే పోటీగా ఇతర సినిమాలతో ఏ మాత్రం పోటీ ఉండకూడదు. సీజన్ సంక్రాంతి అయినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితులను బట్టి బాక్సాఫీస్ వద్ద ఫైట్ అనేది అందరికీ నష్టమే అని చెప్పాలి.

అయితే పోటీగా భీమ్లా నాయక్ సినిమా కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి RRR నిర్మాత డి.వి.వి.దానయ్య ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిపారు. ఇక ఎవరు ఎన్ని చర్చలు జరిగినా కూడా ఇంతవరకు ఆ విషయంలో క్లారిటీ రాలేదు. ఇక ఆ టెన్షన్ తట్టుకోలేక దర్శకుడు రాజమౌళి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు భీమ్లా నాయక్ సినిమా వాయిదా పడుతుంది అని చాలా కథనాలు వచ్చాయి. కానీ ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు అని,

అనుకున్న సమయానికే జనవరి 12న పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. భీమ్లా నాయక్ సినిమాను వాయిదా వేసుకునే విధంగా చేయాలి అని దర్శకుడు రాజమౌళి పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే నిర్మాతలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా చర్చించే అవకాశం ఉందట. మరి ఈ చర్చలతో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus